ఎన్నికల ప్రచార సామాగ్రి అప్పుడు డబ్బాల్లో..! ఇప్పుడు లారీల్లో..!!

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసే హడావుడిలో కేసీఆర్.. తెలంగాణ భవన్‌లో చాలా సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా…ప్రగతి నివేదన సభకు.. జనసమీకరణ వ్యవహారంపై.. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకు… దిశానిర్దేశం చేసేందుకు ఓ సమావేశం పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి 20 వేల మందిని తీసుకు రావాలని… టార్గెట్ పెట్టి.. ఎన్నికల ప్రచార సామాగ్రి కింద.. ఓ కార్టన్ బాక్స్‌ను పంపిణీ చేశారు. అందులో ఉన్నది.. ఎన్నికల ప్రచార సామాగ్రి మాత్రమే. కానీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు… మాత్రం.. అంత చిన్న డబ్బాల్లో పట్టే ప్రచార సామాగ్రి ఏమి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అందులో రూ. కోటి ఉన్నాయని… ప్రగతి నివేదన సభకు..జనాలను తరలించడానికి … ఆ డబ్బులు పంపిణి చేశారని ఆరోపించారు.

ఆ తర్వతా ఇప్పుడు కేసీఆర్‌ మరోసారి అభ్యర్థులకు ప్రచార సామాగ్రి పంపిణీ చేశారు. అభ్యర్థులందరికీ.. వాహనాల్లోప్రచార సామాగ్రి పంపారట. అవి కూడా బాక్సులే. అయితే.. ఏ రాజకీయ పార్టీ అయినా అభ్యర్థికి సొంతంగా ప్రచార సామాగ్రి ఇవ్వదు. పార్టీ తరపున ఏమైనా భారీ కార్యక్రమాలు జరిపితే… పంపుతుందేమో కానీ… మొత్తం ట్రక్కుల్లో ప్రచార సామాగ్రి మాత్రం పంపదు. కానీ కేసీఆర్ మాత్రం.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే.. అన్నీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి.. ప్రచార సామాగ్రి పంపిణీని కూడా పూర్తి చేశారు. ఈ సారి ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు.. ఒక్క రూపాయికూడా ఖర్చు పెట్టవద్దని.. మొత్తం పార్టీనే భరిస్తుందని.. కేసీఆర్ హామీ ఇచ్చినట్లు జరుగుతోంది. నేరుగా నియోజకవర్గానికి కొన్ని కోట్లు వస్తాయని కూడా చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇప్పుడు అవి కూడా ప్రచార సామాగ్రిలో ఉన్నాయేమో అన్న సందేహాలు సహజంగానే కాంగ్రెస్ నేతలకు వస్తాయి.

విచిత్రం ఏమింటటే.. ఇలా ప్రచార సామాగ్రి పంపిణీ పూర్తయిందని..టీఆర్ఎస్ మీడియా…ప్రకటించగానే… ఇటుఎన్నికల సంఘం… ఇప్పటి నుంచి భారీ లావాదేవీలపై దృష్టి పెడుతున్నట్లు ప్రకటిచింది. ఈ సారి పోటీ తీవ్ర స్థాయిలో ఉండటంతో.. డబ్బే ప్రధాన పాత్ర పోషించబోతోంది. అందుకే.. హైదరాబాద్ లో హవాలా వ్యాపారానికి అడ్డా అయిన బేగంబజార్ లాంటి చోట నుండి నోట్ల కట్టలు నియోజకవర్గాలకు చేరుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ తరలింపులపై ఈసీ నిఘా పెట్టింది. బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తారట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close