వరంగల్ తూర్పు రివ్యూ: కొండా సురేఖ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..?

కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయమవడంతో.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ టిక్కెట్ కోసం పోటీ పెరిగింది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాల్లో 11 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. కొండాసురేఖకు టిక్కెట్ నిరాకరించడంతో టికెట్ మాకంటే మాకు అంటూ ఎవరికి వారు ప్రచారం మొదలు పెట్టేశారు. కొందరు సీనియర్లు కాగా.. కొందరు కనీసం కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం లేని వారు ఉన్నారు. బీసీ నియోజకవర్గంగా పేరున్న తూర్పులో బీసీ నేతలకే టికెట్ దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు పంపారు.

పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే నేత టిక్కెట్ కోసం.. ప్రయత్నించగానే.. తూర్పు టికెట్ బీసీలకే అని చెప్పేశారట. కొండాసరేఖ వంటి నేత స్థానాన్ని భర్తీ చేయాలంటే ఆ స్థాయి నేతలు కూడా కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే మూడు సర్వేలు చేయించారు. మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, మేయర్ నరేందర్, గుండుసుధారాణిలు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు కు నాలుగోస్థానం దక్కింది. అయినప్పటికీ ప్రదీప్ రావు తన ప్రచారం మొదలుపెట్టారు. టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేస్తానంటూ చెబుతున్నారట. ఇక తమ నేతలకు టికెట్ ఇవ్వాలంటూ కోరుతున్న వారిలో గుడిమెల్ల రవికుమార్ అనే నేత ముందు ఉన్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నందున.. అవకాశం ఇవ్వాలంటూ ఆయన అనుచరులు భారీ ర్యాలీలు చేపడుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించి విధేయత కనబర్చే గుడిమెల్ల విషయంలో కేసీఆర్ కు కూడా కొంత సానుభూతి ఉందని చెబుతున్నారు. 2015లో వరంగల్ ఎంపీ బై ఎలక్షన్స్ లో చివరి నిముషంలో కులవివాదంతో టికెట్ అవకాశం చేజార్చుకున్న గుడిమెల్లకు ఆతర్వాత ఇచ్చిన నామినేటెడ్ చైర్మన్ పదవి కూడా న్యాయపరమైన చిక్కులతో పోయింది.

ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలంటూ కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉద్యమకారులైన విద్యార్థుల్లో టికెట్లు పొందిన వారు అందరూ ఎస్సీలేనని, తాను బీసీ విద్యార్థిగా ఉద్యమం ప్రారంభం నుంచి ఎన్నో లాఠీ దెబ్బలు తిని తెలంగాణ సాధించడంలో భాగస్వామినయ్యానంటూ విద్యార్థి నేత రాజ్ కిషోర్ టిక్కెట్ కోరుతున్నారు. ప్రస్తుత కార్పొరేటర్లుగా ఉన్న గుండా ప్రకాశ్ రావు వైశ్యసంఘం నుంచి, వద్దిరాజు గణేశ్ బ్రాహ్మణ సంఘం నుంచి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తంగా బస్వరాజు సారయ్యకు లేకపోతే.. గుడిమెల్ల రవికుమార్‌కు మాత్రం… ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రచారం వరంగల్ తూర్పు టీఆర్ఎస్‌లో జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close