కృత్రిమ మేధ రంగంలో ప్రపంచ స్థాయి శక్తులు మన దేశం వైపు చూస్తున్న తరుణంలో, ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026 వేదికగా జరిగిన అర్ధనగ్న నిరసనలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, టెక్ దిగ్గజాలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా చొక్కాలు విప్పేసి నినాదాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశం దృష్టిలో మరోసారి విలన్గా కాంగ్రెస్
దేశాన్ని సాంకేతిక రంగంలో ముందంజలో ఉంచేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని రాజకీయ లబ్ధి కోసం అడ్డుకోవడం దేశానికి తలవంపులు తేవడమేనని ఈ నిరసనలకు ట్రంప్ విధించిన టారిఫ్లతో సంబంధం లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ శ్రేణులు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలను సాకుగా చూపి సమ్మిట్ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ప్రధాని రాజీ పడ్డారు అంటూ నినాదాలు చేస్తూ అంతర్జాతీయ ప్రతినిధుల ముందు ఇలాంటి ప్రదర్శనలు చేయడం దేశ గౌరవానికి తీరని నష్టం కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ వంటి వారు కూడా దీన్ని ఖండించారు.
ఏఐ సమ్మిట్లో అర్థనగ్న ప్రదర్శనలు చేసి మరో తప్పిదం చేసిన కాంగ్రెస్
ముఖ్యంగా ఈ తరహా నిరసనలను మేధావుల పేరుతో కొందరు సమర్థించడంపై సామాన్య ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నప్పుడు నిరసనలు ఉంటాయని కొంత మంది అంటున్నారు. పర్యావరణ , రక్షణ సదస్సులు జరిగినప్పుడు కొన్ని ఆందోళనలు జరుగుతూంటాయి. వారిది ప్రపంచ స్థాయి సమస్య. కానీ ఏఐ సమ్మిట్ పూర్తిగా దేశ భవిష్యత్తు కోసం నిర్వహించిన సదస్సు. రాజకీయ విమర్శలు చేయడానికి ఎన్నో వేదికలు ఉండగా, దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ వేదికను ఎంచుకోవడం దేశంపై జరుగుతున్న దాడి అని విమర్శకులు రాకుండా ఎందుకు ఉంటాయి?.
ఈ తప్పిదాన్ని ఎలా సమర్థించుకుంటారు?
ఇలాంటి చర్యలు పెట్టుబడిదారుల్లో అభద్రతను నింపుతాయని, యువతకు లభించే ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ బేస్ లెస్ విధానాలు పార్టీ పతనాన్ని సూచిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అదే సదస్సులో పాల్గొని కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెబుతుంటే, మరోవైపు అదే పార్టీ కార్యకర్తలు ఇలాంటి దిగజారుడు ప్రదర్శనలు చేయడం ఆ పార్టీలోని ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపుతోంది. దేశ గౌరవం కంటే రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న పార్టీ తీరుపై యువత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.
