వైసీపీ వాళ్ల కడుపు మండిపోతోంది. లోకేష్ చేసే పనులతో ఆయనకు వస్తున్న పేరు చూసి రగిలిపోతున్నారు. వెంటనే రంగంలోకి దిగి క్రెడిట్ చోరీ అంటూ ప్రచారాలు చేసేస్తున్నారు. తాజాగా పునర్విక విషయంలోనూ అదే చేస్తున్నారు. లోకేష్‌కు క్రెడిట్ వచ్చేస్తోందని గగ్గోలు పెడుతూ తప్పుడు ప్రచారాలు ప్రారంభించారు. కానీ నిజాలు మాత్రం వేగంగా అందరికీ తెలిసిపోయాయి. వారి సైకో మనస్థత్వాన్ని బయట పెట్టాయి.
పునర్వికకు పునర్జన్మ
కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన ఎస్ఎంఏ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆమెకు కావాల్సిన రూ. 16 కోట్ల ఇంజెక్షన్ కోసం యావత్ తెలుగు సమాజం కదిలింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నెటిజన్లు దాదాపు రూ. 10 కోట్లు పోగు చేయగా, మిగిలిన రూ. 6 కోట్ల భారం కొండలా నిలిచింది. సరిగ్గా ఆ సమయంలో రంగంలోకి దిగిన నారా లోకేష్, ఈ పాప బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, తన వ్యక్తిగత సర్కిల్, ఫ్రెండ్స్ , కార్పొరేట్ సంస్థల ద్వారా ఆ రూ. 6 కోట్లను సమకూర్చడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అమెరికా నుండి ఆ ఇంజెక్షన్ త్వరగా వచ్చేలా స్వయంగా పర్యవేక్షించారు. శనివారం ఆ పాపకు ఇంజెక్షన్ అందడంతో లోకేష్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
వైసీపీ ఫేక్ పాలిటిక్స్
లోకేష్‌కు వస్తున్న ఈ పాజిటివ్ మైలేజ్ చూసి తట్టుకోలేక వైసీపీ సోషల్ మీడియా వితండవాదానికి తెరలేపింది. ఇది లోకేష్ సొంతం సాయం కాదని, ప్రజల సొమ్మైన సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి ఆ రూ. 6 కోట్లు ఇచ్చి లోకేష్ క్రెడిట్ కొట్టేస్తున్నారని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అయితే, అసలు వాస్తవం ఏమిటంటే.. పునర్విక చికిత్సకు ఏపీ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా సీఎంఆర్ఎఫ్ నిధులు అందలేదు. మొత్తం నిధులు దాతలు , లోకేష్ సేకరించిన ఆర్ నిధుల ద్వారానే సమకూరాయి. ఒక పసిపాప ప్రాణం పోసిన వేళ కూడా ఇలాంటి క్రెడిట్ చోరీ ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది.
జగన్ ఒక్క శాతం దానం చేసినా పబ్లిసిటీ వస్తుందిగా!
వైసీపీ వాళ్ళ కడుపు మంటపై టీడీపీ శ్రేణుల సెటైర్లు వేస్తున్నాయి. లోకేష్ చేసే మంచి పనులపై కుళ్ళుకోవడం కన్నా.. జగన్ రెడ్డి పోగేసుకున్న వేల కోట్లలో కనీసం ఒక్క శాతం ప్రజల కోసం దానధర్మాలు చేయడం మొదలుపెడితే, లోకేష్ కంటే పదింతలు ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది కదా అని ఎద్దేవా చేస్తున్నారు. ఉన్న అక్రమాస్తులు కాపాడుకోవడానికే టైమ్ సరిపోతుంటే, ఇక దానాలు ఎక్కడ చేస్తారని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. లోకేష్ తన చదువు, నెట్‌వర్క్‌ను వాడుకుని ఒక ప్రాణాన్ని కాపాడితే, దానిపై కూడా విషం చిమ్మడం వైసీపీ మార్క్ సైకోయిజం అని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.
పని చేసేవారికే పేరు
రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ, ఇలాంటి ప్రాణసంకట స్థితిలో ఉన్న చిన్నారి విషయంలో కూడా రాజకీయం చేయడం ఎవరికీ మంచిది కాదు. నారా లోకేష్ ఒక మంత్రిగా కాకుండా ఒక తండ్రిలా స్పందించి, తన సొంత చొరవతో ఆరు కోట్లు సమకూర్చి పునర్వికకు పునర్జన్మ ఇచ్చారు. ఈ విషయంలో నిజాలు అందరికీ తెలుసు కాబట్టి, వైసీపీ సోషల్ మీడియా సైకోతనం అందరికీ అర్థమవుతుంది. దానగుణం లేని వారు, దానం చేసే వారిని చూసి ఏడవటం కన్నా మౌనంగా ఉండటమే వారి గౌరవానికి మంచిదని సలహాలు కూడా వైసీపీకి వస్తున్నాయి.
