ఏపీ అధికారుల్లో “కోర్టు ధిక్కరణ” చిచ్చు – రంగంలోకి సీఎస్ !

ఏపీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కోర్టు ధిక్కరణ కేసులు తమ మెడకు చుట్టుకుంటూడంతో చీఫ్ సెక్రటరీపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పాటించమని ఆదేశించే తమను.. కోర్టు ధిక్కరణ కేసుల నుంచి ఎందుకు కాపాడటంలేదని వారు సీఎస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలక్ష్మి ఇప్పటికే తన పేరుతో అఫిడవిట్లు సమర్పించవద్దని తేల్చి చెప్పడంతో ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇతర అధికారులు కూడా అదే బాటలో ఉన్నారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో నిర్ణయాలు తమవి కాదన్నట్లుగా ఉండే ఉత్తర్వుల కోసం ఒత్తిడి పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.

హైకోర్టులో కొన్ని వందల కేసుల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. బిల్లులు చెల్లింపు కేసులో ఎక్కువ. ప్రభుత్వం నిధులివ్వదు. చెల్లిస్తే బయటపడొచ్చు.కానీ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల తాము జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని.. దీన్ని సీఎస్‌గా ఎలా చూస్తూ ఉండిపోతారని సివిల్ సర్వీస్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే ఈ అంశంపై సీఎస్ ప్రత్యేకంగా సమీక్ష చేయాలని నిర్ణయించారు. శుక్రవారం అన్ని శాఖల అధికారులతో కోర్టు ధిక్కరణ కేసులపై సమీక్ష చేయనున్నారు.

ఇక నుంచి ఒక్క అధికారికి కూడా శిక్ష పడకుండా చూస్తామని సీఎస్ హామీ ఇస్తున్నారు. కానీ అలా చేయాలంటే కోర్టు ఉత్తర్వులను పాటించాలని.. వందల కేసుల్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా పాటించలేదని సివిల్ సర్వీస్ అధికారులు అంటున్నారు. శుక్రవారం సమీక్షలో కోర్టు ఉత్తర్వులు పాటించకుండా ఉన్న వేవో కూడా పరిశీలించనున్నారు. అన్ని ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రయత్నించనున్నారు. మొత్తానికి ఉన్నతాధికారుల్లో కోర్టు గండం గట్టిగా నే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close