భారత్‌లో కరోనా సెకండ్ వేవ్..!

ప్రపంచం మొత్తం కరోనా సెకండ్ వేవ్‌లోకి వచ్చేసింది. దానికి భారత్ కూడా అతీతం కాదు. అమెరికాలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూండగా.. ఇండియాలో కూడా.. అదే స్థాయిలో పెరుగుదల నమోదవుతోంది. గత కొన్నాళ్లుగా ఇండియా కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. అనూహ్యంగాఇప్పుడు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో యాభై వేలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84 లక్షలు దాటిపోయింది. మృతుల సంఖ్య లక్షా పాతికవేలు దాటింది. అయితే రికవరీ రేటు ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం దేశంలో ఐదు లక్షలు మాత్రమే యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 92 శాతం మందికిపైగా డిశ్చార్జ్ అయ్యారు.

శీతాకాలం ప్రారంభమవ్వడం.. పూర్తి స్థాయిలో అన్‌లాక్ నిబంధనలు సడలించడంతో…కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంటుంది..అది మరింత ప్రమాదకరంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. యూరప్ దేశాలు ఇప్పటికే సెకండ్ లాక్ డౌన్ ప్రకటించేశాయి. చాలా దేశాల్లో జన జీవనం స్తంభించిపోయింది. యూరప్ వాసులపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అక్కడ ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటోంది. దీంతో లాక్‌డౌన్‌కే మొగ్గుచూపుతున్నాయి. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం కోరనాను తేలిగ్గా తీసుకుంటున్నాయి. అందులో భారత్ కూడా ఉంది.

కరోనా నిబంధనలు పేరుకు మాత్రమే ఉన్నాయి . ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ముందుగా ప్రభుత్వ పెద్దలు.. అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తే.. సామాన్యులు కూడా పాటిస్తారు. ఇండియాలో.. కరోనా తమకు అతీతం అన్నట్లుగా అధికారం ఉన్న వారు వ్యవహరిస్తూంటారు. దాంతో.. సామాన్యులు కూడా కరోనాను లైట్ తీసుకుంటున్నారు. ఇది సెకండ్‌వేవ్‌కు దారి తీస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close