దాడి మ‌ళ్లీ వైకాపాలో చేరిన అస‌లు కార‌ణం ఇద‌న్న‌మాట‌..!

మాజీ మంత్రి దాడి వీర‌భ‌ద్ర‌రావు మ‌ళ్లీ వైకాపాలో చేరారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం చారిత్ర‌క అవ‌స‌ర‌మ‌న్నారు! ఆయ‌న నాయ‌క‌త్వంలోనే రాష్ట్రం బాగుప‌డుతుంద‌న్న విశ్వాసం త‌న‌కి ఉంద‌న్నారు. పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని జ‌గ‌న్ బాగా తెలుసుకున్నార‌నీ, నాయ‌కుడిగా ఆయ‌న ప‌రిపూర్ణ‌త సాధించారంటూ మెచ్చుకున్నారు. సుప‌రిపాల‌న ఇస్తార‌న్న న‌మ్మ‌కంతో గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడుకి అధికార‌మిచ్చార‌నీ, కానీ ప్ర‌జ‌ల ఆశ‌ల్ని ఆయ‌న ఒమ్ము చేశార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీతో ఈ మ‌ధ్య జ‌త‌క‌డుతున్నార‌నీ, ఏ క్ష‌ణ‌మైనా ఆ పార్టీలో టీడీపీని విలీనం చేసే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని దాడి విమ‌ర్శించారు.

వాస్త‌వానికి, దాడి వీర‌భ‌ద్ర‌రావు గ‌త నాలుగున్న‌రేళ్లుగా క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. 2014 ఎన్నిక‌లకి ముందే ఆయ‌న వైకాపాలో చేరారు. ఎన్నిక‌లు పూర్త‌య్యాక‌… జ‌గ‌న్ తీరు న‌చ్చ‌డం లేద‌నీ, పార్టీలో స‌రైన ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌న్న కార‌ణాలు చూపుతూ వైకాపా నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేశారు. మ‌రి, ఇప్పుడు వైకాపాలో కొత్త‌గా ఏ ప్రాధాన్య‌త ద‌క్కుతుంద‌ని ఆయ‌న తిరిగి వెళ్లిన‌ట్టు అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మౌతుంది. అయితే, టీడీపీలో ఒక వెలుగు వెలిగిన దాడి, ఇప్పుడు వైకాపాలో తిరిగి చేర‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు వేరు! చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాక తిరిగి టీడీపీలో చేరే ప్ర‌య‌త్నాలూ దాడి చేశారు. కానీ, పార్టీ అధినాయ‌క‌త్వం నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. ఇక ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే… కొణ‌తాల రామ‌కృష్ణ‌కు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌నే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అన‌కాప‌ల్లి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా ఆయ‌న బ‌రిలోకి దిగుతార‌నే ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీలో దాడికి అవ‌కాశం లేకుండా పోయింది.

దాడిని వైకాపా వైపు అడుగులు వేయించిన మ‌రో కార‌ణం… ఆయ‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తు అని కూడా చెప్పొకోవ‌చ్చు. ఇదే ఉద్దేశంతో ఈ మ‌ధ్య జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా దాడి క‌లిశారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల లెక్క‌ల ప్ర‌కారం చూసుకుంటే దాడిని చేర్చుకునే అవ‌కాశం జ‌న‌సేన‌లో ఉంద‌నే ప్ర‌చార‌మూ జ‌రిగింది. అయితే, జ‌న‌సేనాని నుంచి కూడా స‌రైన సంకేతాలు రాక‌పోవ‌డంతో… ఏదో ఒక పార్టీలో చేరాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అందుకే, చివరికి సొంత గూటికే చేరా అంటూ వైకాపాలోకి వ‌చ్చారు. ప్రాధాన్య‌త ద‌క్క‌లేదంటూ గ‌తంలో విమ‌ర్శ‌లు చేసిన వెళ్లిన దాడికి… ఇప్పుడు వైకాపా ఏ స్థాయి ప్రాధాన్య‌త ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close