కోమటిరెడ్డిపై వేటు వేస్తేనే కాంగ్రెస్‌లో క్రమశిక్షణ..!

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని సెటైరిక్‌గా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే.. ఎవరి అజెండాను వారు అమలు చేస్తూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని కూడా అడ్డగోలుగా విమర్శించేస్తూ ఉంటారు. పార్టీ అవసానదశకు చేరినా.. పార్టీ నేతల ఈ తీరు మారలేదని.. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శల ద్వారా స్పష్టమయింది. ఆయన సోదరుడు ఇప్పటికే బీజేపీ బాట పట్టారు. పీసీసీ ఇవ్వకపోతే తానూ బీజేపీకే పోతానన్న సంకేతాలను తరచూ గడ్కరీతో భేటీ అవడం ద్వారా కోమటిరెడ్డి కూడా పంపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ బ్లాక్‌మెయిల్‌కు లొంగినట్లుగా లేదు. రేవంత్ రెడ్డికి కిరీటం ప్రకటించింది.

దాంతో కోమటిరెడ్డి రెచ్చిపోయారు. నేరుగా హైకమాండ్‌పైనే విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని తూలనాడటం ప్రారంభించారు. ఆయన ఓ పక్కా రాజకీయ ఎజెండా ప్రకారం.. విమర్శలు చేసినట్లుగా కాంగ్రెస్ నాయకులకు అర్థమైపోయింది. ఈ క్రమంలో పార్టీ హైకమండ్‌ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల గురించి వివరాలు సేకరించింది. కానీ చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు కీలకం. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇంత కంటే దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కానీ.. చర్యలు తీసుకోలేదు. తీసుకుంటామని హడవుడి చేశారు. ఏమీచేయలేరన్న అలుసుతోనే కోమటిరెడ్డి ఇలా రెచ్చిపోయినట్లుగా భావిస్తున్నారు.

కోమటిరెడ్డిపై ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే.. అలాంటి అసంతృప్తి స్వరాలు పెరిగిపోతాయి. తాము కోరుకున్న పదవి రాని ప్రతి ఒక్క నాయకుడు … సొంత పార్టీని ఎన్ని మాటలయినా అనేందుకు వెనుకాడరు. అందుకే ఇప్పుడు కోమటిరెడ్డిపై గట్టి చర్య తీసుకోవాలన్న డిమాండ్ ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే ఇతరులకు సందేశం పంపినట్లవుతుందని అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినందున.. క్యాడర్‌లో ఉత్సాహం ఉందని.. ఇలాంటి డైవర్షన్ రాజకీయాల వల్ల.. అది చల్లబడిపోతే.. మొత్తంగా పార్టీకే ప్రమాదమని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా… ఈ విషయంపై ఆలోచించి కఠిన నిర్ణయం తీసుకుంటేనే… టీఆర్ఎస్‌ పై పోరాటానికి… కొత్త నాయకత్వానికి వెసులుబాటు ఉంటుంది. లేకపోతే.. పార్టీ అంతర్గత సమస్యలతో కొట్లాటలకే సమయం సరిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశాఖ వర్సెస్ అమరావతి… ఉత్కంఠపోరులో గెలుపెవరిది..?

ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజధాని భవితవ్యం ఆధారపడి ఉంది. ఫ్యాన్ గాలి వీస్తే విశాఖ వేదికగా పరిపాలన సాగడం ఖాయం. సైకిల్ పరుగులు పెడితే మాత్రం అమరావతి క్యాపిటల్ సిటీ అవ్వడం పక్కా....

రేవంత్ తో మ‌ల్లారెడ్డి భేటీ… క‌బ్జాల సంగ‌తి తేలుతుందా?

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య జ‌రుగుతున్న భూ వివాదం సీఎం వ‌ద్ద‌కు చేరింది. ఈ వివాదంలో ఇద్ద‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌టంతో రెవెన్యూ అధికారులు ఇప్ప‌టికే స‌ర్వే కూడా...

ధోనీ చివ‌రి మ్యాచ్ ఆడేసిన‌ట్టేనా?!

ఐపీఎల్ సీజ‌న్ న‌డుస్తున్న ప్ర‌తీసారి ధోనీ రిటైర్‌మెంట్ గురించిన ప్ర‌స్తావ‌న రాక మాన‌దు. 'ఈసారి ధోనీ రిటైర్ అవుతాడా' అనే ప్ర‌శ్న ఎదుర‌వుతూనే ఉంటుంది. ఆ ప్ర‌శ్న‌కు ధోనీ చిరున‌వ్వుతో స‌మాధానం చెప్పి...

బెంగళూరు రేవ్ పార్టీ…వారిని తప్పించే ప్రయత్నం జరుగుతోందా..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులను తప్పించే ప్రయత్నం జరుగుతుందా..? ఈ విషయంలో మొదట దూకుడుగానే స్పందించిన బెంగళూరు పోలీసులు ఆ తర్వాత సైలెంట్ కావడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close