క‌న్‌ఫామ్‌: ప‌వ‌న్‌తో శ్రుతిహాస‌న్‌

హ‌మ్మయ్య‌.. ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి సినిమాల‌పై గాలి మ‌ళ్లింది. ఉంటుందా, ఉండ‌దా?? అనుకొన్న డాలీ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఆగ‌స్టు నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌లెడ‌తార‌ని స‌మాచారం. ఇప్పుడు క‌థానాయిక పేరు కూడా క‌న్‌ఫామ్ అయ్యింది. శ్రుతిహాస‌న‌న్‌ని ప‌వ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. ఎస్‌,జె సూర్య ఈ ప్రాజెక్టులో ఉన్న‌ప్పుడే క‌థానాయిక‌గా శ్రుతి పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చింది. అయితే త‌న కాల్షీట్లు అందుబాటులో లేక‌పోవ‌డంతో శ్రుతి స్థానంలో ర‌కుల్‌ప్రీత్ ని ఎంచుకొన్నారు. ఆ త‌ర‌వాత సూర్య ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డం, సినిమా ఆల‌స్యం అవ్వ‌డంతో ర‌కుల్ డేట్లు కూడా దొర‌క‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ శ్రుతి లైన్‌లోకి వ‌చ్చింది. గ‌బ్బ‌ర్‌సింగ్ తో ఆక‌ట్టుకొన్న ఈ జంట‌.. మ‌రోసారి క‌నువిందు చేయ‌నుంద‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం డాలీ స్క్రిప్టు ప‌నుల్లో ఉన్న‌ట్టు చిత్ర‌బృందం చెబుతోంది. అనూప్ రూబెన్స్‌స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. ఇప్ప‌టికే మూడు పాట‌ల్ని కూడా రికార్డ్ చేసేశారట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close