‘బాబులకే బాబు.. మహేష్ బాబు’ ఇలాంటి స్లోగన్స్ పుట్టించడంలో ఫ్యాన్స్ దిట్ట. ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ, కొత్త సినిమా విడుదల రోజులన థియేటర్ల దగ్గర ఇలాంటి స్లోగన్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ కలిపి ఓ పాట రాసేశారు. ఆంధ్రా కింగ్ తాలుకా సినిమా కోసం. రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఉపేంద్ర కీలక పాత్రధారి. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు ఓ పాట విడుదల చేశారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే ఈ పాట కూడా ఆ వాతావరణానికి తగ్గట్టుగా క్రియేట్ చేశారు. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసే హంగామాని తలపిస్తూ ఈ పాట సాగింది.
ఆల్ ఆఫ్ యూ సింగూ
మన ఆంధ్రాకే కింగు
అన్నకు మేమే ఫ్యాన్సూ
మేం వేస్తామురా డాన్సు
వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు
మావోడి గ్లామరూ
పాపలకే ఫీవరూ.. – పాటంతా ఇవే స్లోగన్సూ.
వివేక్ – మార్విన్ ఈ చిత్రానికి సంగీత దర్శకులు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు శ్రోతల్ని అలరించాయి. రామ్ ఈ సినిమా కోసం ఓ పాట రాశాడు. ఓ పాట పాడాడు. ఆ రెండు పాటలూ బాగా క్లిక్ అయ్యాయి. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. ఈనెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

