ఫస్ట్ పోస్ట్ సర్వే : ప్రధానిగా ఎవరు..? అక్కడ మోడీ.. ఇక్కడ రాహుల్..!

దేశంలో మళ్లీ నరేంద్రమోడీని ప్రధానిగా ప్రజలు కోరుకుంటున్నారని.. ఫస్ట్ పోస్ట్ సంస్థ.. నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని కావాలని 52.8శాతం మంది అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి 26.9శాతం మంది మద్దతు లభించింది. మమతా బెనర్జీ ప్రధాని కావాలని 4.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పనితీరు చాలా బాగుందని 19.9శాతం, బాగా పనిచేస్తున్నారని 36.06శాతం, పర్వాలేదని 21.40 శాతం మంది చెప్పారు. 18.70శాతం మంది మాత్రమే బాగోలేదని చెప్పారని అభిప్రాయసేకరణలో వెల్లడయింది. దేశాన్ని మోడీ అయితే బాగా చూసుకుంటారని యాభై ఐదు శాతం మంది చెప్పారు.

మళ్లీ మోడీయే వస్తారు..!

2019 ఎన్నికల్లో ఏ కూటమికి ఓటు వేస్తారనే ప్రశ్నకు ఎక్కువ మంది ఎన్డీఏ వైపు నిలిచారు. ఎన్డీయేకి ఓటు వేస్తామని 58శాతం చెప్పారు. మహాకూటమికి ఓటు వేస్తామని 42 శాతం మంది తెలిపారు. 2019 ఎన్నికల్లో ఏ అంశం అత్యంత ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని ప్రశ్నించగా, అభివవృద్ధేనని మెజారిటీ ప్రజలు స్పష్టం చేశారు. కులాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 85శాతం మంది రాబోయే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా నిలుస్తుందన్నారు. దేశంలోని 23 రాష్ట్రాల్లోని 285 జిల్లాల్లో సర్వే చేసింది. 34,470 శాంపిల్స్ సేకరించింది. దేశంలోని 60శాతం పార్లమెంట్ నియోజకవర్గాల్లో శాంపిల్స్ సేకరించింది. అందులో 690 గ్రామాలు ఉన్నాయి. 291 పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. మొత్తంగా ప్రజాభిప్రాయాన్ని విశ్లేషిస్తే.. మళ్లీ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని.. సర్వే వెల్లడించింది. బీజేపీయేతర పక్షాల కూటముల్లో ముఖ్య నాయకులుగా ఉన్న వారిలో… మమతా బెనర్జీ.. హిందీ రాష్ట్రాల్లోనూ.. ఎక్కువగ పరిచయం కలిగి ఉన్నారు. అలాగే దళిత నాయకురాలు మాయావతి కూడా.. తన ఇమేజ్ తో దేశంలో బాగా పరిచయమనున్న నేత. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రం ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో మాత్రమే బాగా గుర్తించగలరు. హిందీ రాష్ట్రాల్లో ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెలియదని సర్వేలో తేలింది.

ఉత్తరాదికి హీరో.. దక్షిణాదికి విలన్..!

ఉత్తరాదిలో.. నరేంద్రమోడీకి.. ఏకపక్షంగా మద్దతు లభించినప్పటికీ.. దక్షిణాదిలో ప్రజలు ఆయనను ఓ విలన్ గా చూస్తున్నారు. ఏపీలో మోడీ పని తీరు అత్యంత దారుణంగా ఉంది.. 89 శాతం తేల్చారు. ఆ తర్వాత తమిళనాడులో 88 శాతం , కేరళలో 68 శాతం, కర్ణాటకలో యాభై ఐదు శాతం మంది మోడీ పని తీరు ఘోరంగా ఉందని అభిప్రాయపడ్డారు. అనూహ్యంగా తెలంగాణలో మోడీ పని తీరు బాగుందని … 65 శాతం మంది చెప్పినట్లు సర్వే వెల్లడించింది. ఇక మోడీ, రాహుల్‌ గాంధీల్లో ఎవరు ప్రధాని కావాలని కోరుకుంటున్నారని.. ఆరా తీస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రాహులే ముందంజలో ఉన్నారు. ఏపీలో ప్రధానిగా మళ్లీ మోడీ రావాలని కేవలం 14.5 శాతం మాత్రమే కోరుకున్నారు. 68.8 శాతం రాహుల్ రావాలని కోరుకున్నారు. తమిళనాడు, కేరళల్లోనూ దాదాపుగా.. పరిస్థితి అంతే ఉంది.

ఏపీలో పరిస్థితి ఏమిటి..?

దక్షిణాదిలో ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కానీ.. బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న పార్టీలకు.. కానీ ప్రజాదరణ లేదని.. రాదని… సర్వే వెల్లడించింది. విభజన హామీలు అమలు చేయకపోవడంతో… బీజేపీకి.. ఏపీలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని.. మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేల్చింది. దేశవ్యాప్తంగా జరిగిన సర్వే ప్రకారం.. చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో… వైసీపీ కన్నా.. తెలుగుదేశం పార్టీ రెట్టింపు ఓట్లు సాధిస్తుందని ఫస్ట్ పోస్ట్ సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా పోటీ చేసే బీజేపీ 45 శాతం ఓట్లు సాధిస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ సుదీరంగా.. 14.6 శాతం సాధించొచ్చు. టీడీపీకి 2.5 శాతం ఓట్లు.. వైసీపీకి 1.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా. దేశవ్యాప్తంగా… ఓటర్ల పర్సంటేజీ తీసుకున్నారు కాబట్టి.. టీడీపీకి, వైసీపీకి మధ్య ఒక శాతానికిపైగా తేడా ఉంది. అంటే.. దాదాపుగా… ఏపీలోటీడీపీకి ఏకపక్షంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమిదే విజయమని వైసీపీ అభ్యర్థుల బెట్టింగులు..!!

స్వయంగా జగన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రకటించినా వైసీపీలో ఆ ధీమా ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో బెట్టింగ్ కాస్తుండగా...వైసీపీ తరఫున...

ఓట్లు ఎలా వస్తాయో అలానే మోదీ ప్రచారం !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో మతప రమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మోదీ...

మళ్లీ అదే నినాదం ఎత్తుకున్న మోడీ – ఏంటి సీక్రెట్ ..?

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని తాజాగా మరోసారి 400సీట్లు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు...

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close