గూగుల్‌ కార్పొరేట్ జాబ్ వదిలి కార్పొరేటర్‌గా గెలిచింది!

హైదరాబాద్: మొన్న గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ చరిత్రలోనే రికార్డ్ మెజారిటీతో గెలిచిన అభ్యర్థి – టీఆర్ఎస్‌కు చెందిన సామల హేమ. 22 ఏళ్ళ ఈ యువతికి మరో ఘనత కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాలనుకునే ప్రతిష్ఠాత్మక కార్పొరేట్ సంస్థ గూగుల్‌లో ఉద్యోగాన్ని వదిలి ఈ కార్పొరేటర్ ఎన్నికలకోసం ఆమె రాజకీయాలలోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల నాటికి ఈ యువతికి ఓటు హక్కు కూడా లేదు. ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఓటర్ జాబితాలో పేరు లేకపోవటంతో ఓటు వేయలేదు. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటు హక్కు వచ్చింది. తొలి ఓటు తనకే వేసుకోవటం విచిత్రంగా ఉందని చెబుతున్నారు హేమ. చిన్నప్పటినుంచి స్లమ్ ఏరియాలోనే పెరిగానని ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సీతాఫల్‌మండి ప్రాంతంలో పేద, మధ్యతరగతి కుటుంబాల మధ్య పెరగటంతో ఎన్నికల్లో జనాలకు కలిసిపోవటానికి కష్టపడనవసరం లేకపోయిందని అన్నారు. ఆమె తండ్రి కరాటే రాజు గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఈసారి కూడా ఆయనకే టికెట్ వస్తుందనుకుంటుండగా అనుకోకుండా మంత్రి పద్మారావుగౌడ్ హేమను అభ్యర్థిగా నిర్ణయించారు. ఏడు నెలల క్రితమే హేమ గూగుల్‌లో చేరారు. టీమ్ లీడర్‌గా ప్రమోషన్ వచ్చే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. కార్పొరేట్ జాబ్‌ను, ఐదంకెల జీతాన్ని వదులుకుని కార్పొరేటర్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. గూగుల్‌కు ముందు జెన్‌పాక్ట్‌లో చేశారు. జాబ్ చేస్తూనే కీసరలోని అశ్విత్ జీసస్ కాలేజిలో ఫైనాన్స్‌లో ఎంబీఏ చదివారు. ప్రచారంలో కేటీఆర్ వచ్చినపుడు ఆయనతో సెల్ఫీ తీసుకుంటే, సెల్ఫీలే దిగుతున్నావా, ప్రచారంకూడా చేస్తున్నావా అని అడిగారని హేమ చెప్పారు. గెలిచిన తర్వాత సీఎమ్ కేసీఆర్‌ను కలవటానికి వెళ్ళినపుడు పద్మారావు పరిచయం చేయగానే, గూగుల్ కదా అన్నారని హేమ తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వావ్… బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మాములుగా లేదుగా!

తాజ్ మ‌హాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలిలెవ‌రోయ్... అన్న మాట చాలా సంద‌ర్బాల్లో గుర్తుకొస్తుంది. కిందిస్థాయిలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారిని గుర్తించ‌టం, గౌర‌వించ‌టం కార్పోరేట్ వ్య‌వ‌స్థ‌లో మూల‌న ప‌డిపోయింది. కానీ, ఈసారి ఐపీఎల్ లో...

వైన్స్ ఓన‌ర్స్ Vs బార్ ఓన‌ర్స్… తెలంగాణ‌లో కొత్త పంచాయితీ

మూడు పువ్వులు... ఆరు కాయ‌లుగా సాగే వ్యాపారాల్లో మ‌ద్యం బిజినెస్ కూడా ఒక‌టి. తెల్లారి లేస్తే లెక్చ‌ర్లు ఇచ్చే పొలిటిక‌ల్ లీడ‌ర్స్ నుండి గ‌ల్లీ లీడ‌ర్ల వ‌ర‌కు, కార్పోరేట్ సంస్థ‌లు ఇలా...

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మెగాస్టార్

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయన తాజాగా ఓ జర్నలిస్టుకు తన వంతు...

ఆంధ్రా బాట‌లోనే… తెలంగాణ‌లోనూ కొత్త మ‌ద్యం బ్రాండ్స్

ఏపీలో అత్యంత వివాదాస్ప‌ద‌మైన వాటిలో మ‌ద్యం బ్రాండ్లు ఒక‌టి. గ‌తంలో ఎన్న‌డూ విన‌ని, చూడ‌ని పేర్ల‌తో కొత్త కొత్త మ‌ద్యం బ్రాండ్స్ క‌నిపించాయి. వీటిపై వ‌చ్చిన వార్త‌లు, మీమ్స్ అన్నీ ఇన్నీ కావు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close