గణేశ్‌ ఉత్సవాలపై కోర్టు అదికూడా చెప్పిఉండాల్సిందే!

హైదరాబాదులో గణేశ్‌ ఉత్సవాల సమయంలో విగ్రహాలను హుసేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయడానికి సంబంధించిన వ్యవహారం గురువారం నాడు హైకోర్టు విచారణకు వచ్చింది. హుసేన్‌సాగర్‌లో నిమజ్జనం ను నిలిపి వేయించి, నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఒక వినాయకసాగర్‌ను ఏర్పాటుచేయడం, హుసేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ముమ్మరంగా చర్యలు చేపట్టడం అనే ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ అది. ఈ విషయంలో హైకోర్టు తీర్పు ఇస్తూ.. హుసేన్‌సాగర్‌లో నిమజ్జనం కొనసాగించాల్సిందేనంటూ తీర్పు చెప్పింది. బెంగుళూరు తరహాలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లయితే… సాగర్‌ కాలుష్యం పరంగా పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చునంటూ ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేసింది.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే పర్యావరణానికి విపరీతంగా హాని కలిగిస్తున్న వినాయక విగ్రహాలకు వాడే రసాయన రంగులు, భారీ ఎత్తులతో విగ్రహాలను తయారు చేయడం వంటి విషయాలలో మాత్రం కోర్టు జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. ఎందుకంటే.. వినాయక విగ్రహాలకు సహజసిద్ధ రంగులు మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఓ సూచన చేసి హైకోర్టు ఊరుకుంది. దానికి తగినట్లుగానే.. సహజ రంగుల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తరఫున 5 కోట్ల రూపాయలు కేటాయించాం అంటూ సర్కారు తరఫున న్యాయవాది కూడా నివేదించారు. అయితే ఈ వృథా అంతా అర్థం లేనిది. సహజ రంగులను వాడకపోతే.. వినాయక విగ్రహాలకు అనుమతి ఇవ్వరాదు.. అని కోర్టు స్పష్టంగా ఆదేశించి ఉంటే గనుక.. ఈ ఏడాది విగ్రహాల పరంగా పర్యావరణానికి బోలెడంత మేలు ఖచ్చితంగా జరిగేది.
అలాగే ఎత్తు విషయంలో కూడా.. ఏదో మమ అనిపించినట్లుగా ప్రభుత్వం పట్టించుకోవాలి అని ఊరుకోకుండా.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేదని పలువురు భావిస్తున్నారు. ఈ విషయాలు ప్రత్యేకించి పిటిషన్‌లో అంశాలుగా లేకపోయినప్పటికీ.. ఇప్పుడు ప్రభుత్వానికి సూచనలు చేసిన తరహాలోనే.. హైకోర్టు తనంతగా శ్రద్ధ తీసుకుని అలాంటిది ప్రభుత్వం విధిగా చేసేలా చెప్పి ఉంటే బాగుండేదని పలువురు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close