గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డకు హైకోర్టు ఆదేశం..!

హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.., సుప్రీంకోర్టులో స్టే లభించనప్పటికీ.. తనను విధుల్లో చేరేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదంటూ.. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన నిమ్మగడ్డ రమేష్‌కు.,. హైకోర్టులో ఊరట లభించింది. విధుల్లో చేరేందుకు సహకరించాలనే విజ్ఞాపనపత్రంలో.. గవర్నర్‌ను కలవాలని.. హైకోర్టు ధర్మాసనం ఆయనకు సూచించింది. తాము ఇచ్చిన తీర్పు మేరకు.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియామకంపై గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం మూడు సార్లు సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే లభించలేదని.. నిమ్మగడ్డ రమేష్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల తాము ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నట్లేనని.. ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో.. కోర్టు ధిక్కరణ చిక్కులు ప్రభుత్వానికి తప్పేలా లేవు. గతంలో హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టివేసిన తర్వాత ..కీలక పరిమామాలు చోటు చేసుకున్నాయి. ఎస్‌ఈసీగా బాధ్యతలు తీసుకుంటూ.. సర్క్యూలర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం.. దాన్ని ఉపసంహరించుకుంది., అప్పటి నుంచి న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. తీర్పుపై కాకుండా… నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం చెల్లదనే వాదనపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. ప్రభుత్వం స్టే కోసం ప్రయత్నించింది. వివిద పద్దతుల్లో మూడు సార్లు పిటిషన్లు వేసినా…, స్టే రాలేదు. అయినా… నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను విధుల్లో చేరడానికి ఏపీ సర్కార్ సహకరించడం లేదు.

హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో.. నిమ్మగడ్డ రమష్.. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. మరో వైపు సుప్రీంకోర్టులోనూ.., రెండు, మూడు వారాల్లో… ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణ ముగిస్తామని ధర్మాసనం చెప్పింది. ఈలోపు.. నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకోకుండా.. చూడాలని… ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వేచి చూసే ధోరణిలో ఉంది. ఇప్పుడు… కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణప్రారంభం కావడం… గవర్నర్‌ను కలవాలని… నిమ్మగడ్డను హైకోర్టు ఆదేశించడంతో… వివాదం కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారనేదానిపై… తదుపరి పరిణామాలు ఉండనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి బొత్స రాజీనామా..?

వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఆయన పేరుతోనే ఈ లేఖ బయటకు...

ఏపీ నుంచి ఐ ప్యాక్ ప్యాకప్..!!

ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ఐ ప్యాక్ టీమ్ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఉన్నట్టుండి మూడు వందల మంది ఉద్యోగులు వెళ్ళిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల విజయవాడలోని ఐ ప్యాక్...

దక్షిణాదిపై మోదీ ఆశలు !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతీ విడత పోలింగ్ జరిగే ముందు మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఐదో విడత పోలింగ్ కు ముందు ఇచ్చిన ఇంటర్యూల్లో ఎక్కువగా దక్షిణాది గురించి చెప్పారు. దక్షిణాదిలో తాము...

‘ర‌ణ‌భాలీ’గా రౌడీ దేవ‌ర‌కొండ‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ - రాహుల్ సంకృత్యాన్ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 'ర‌ణ‌భాలీ' అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదో పిరియాడిక్ యాక్ష‌న్ డ్రామా....

HOT NEWS

css.php
[X] Close
[X] Close