స‌ర్కారు వారి ఫైట్‌.. నెవ‌ర్ బిఫోర్‌

ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీన్లు రాసుకోవ‌డంలో.. సిద్ధ‌హ‌స్తుడు అనిపించుకున్నాడు అనిల్ రావిపూడి. ప‌ర‌శురామ్ దీ అదే స్టైల్‌. `గీత గోవిందం`లో గీత దాట‌కుండానే ఎంతో వినోదం పండించాడు. ఎమోష‌న్స్ విష‌యంలో అనిల్ రావిపూడి కంటే కాస్త ఎక్కువే చ‌దివాడు ప‌ర‌శురామ్‌. త‌న క‌థల్లో ఎమోష‌న్ అంత బ‌లంగా ఉంటుంది. అయితే.. త‌న కొత్త సినిమా `స‌ర్కారు వారి పాట‌`లో మాత్రం అనిల్ రావిపూడి ని ఫాలో అవ్వాల‌నుకుంటున్నాడ‌ట‌.

`సుప్రీమ్‌`లో ఫిజిక‌ల్లీ ఛాలెంజ్డ్ వాళ్ల‌ని మెప్పిస్తూ ఓ ఫైట్ క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. ఆ ఫైట్ ఆ సినిమాలో హైలెట్ అయ్యింది. దివ్యాంగుల మన‌సుల‌తో పాటు.. అంద‌రి హృద‌యాల్నీ గెలుచుకుంది. ఇప్పుడు `స‌ర్కారు వారి పాట‌`లోనూ అలాంటి సీన్ ఒక‌టి ఉంద‌ట‌. దివ్యాంగుల నేప‌థ్యంలో ఓ ఫైట్ ఈ సినిమాకి హైలెట్ అవుతుంద‌ని స‌మాచారం. ఓ దివ్యాంగుడి కోసం క‌థానాయ‌కుడు చేసే పోరాటం.. `నెవ‌ర్ బిఫోర్‌`లా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. బ‌హుశా.. ఈ చిత్రానికి ఇంట్ర‌వెల్ ముందొచ్చే యాక్ష‌న్ సీక్వెన్స్ ఇదే కావొచ్చు. ఈ సీన్ చెబుతున్న‌ప్పుడు మ‌హేష్ బాబు చాలా ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. సిల్వర్ స్క్రీన్ పై ఈ ఫైట్ వేరే రేంజ్ లో ఉండ‌బోతోంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. మ‌రి ఆ ఫైట్ నేప‌థ్యం ఏమిటో… దాంట్లో ప‌ర‌శురామ్ త‌న‌దైన మార్క్ ఎలా వేశాడో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close