పుంగనూరు అరాచకం అమిత్ షా దృష్టికెళ్లినట్లే !?

పుంగనూరు ప్రముఖ పారిశ్రామిక వేత్త, గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన రామచంద్రయాదవ్ కు వై సెక్యూరిటీ భద్రతను కేంద్రం కల్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత లేనప్పటికీ.. ఇటీవల రామచంద్ర యాదవ్ అమిత్ షాతో నలబై నిమిషాలకుపైగా సమావేశం అయ్యారు. ఆయనకు అపాయింట్‌మెంట్ రావడం ఏమిటి.. ఏకంగా నలభై నిమిషాల సేపు మాట్లాడటం ఏమిటని అప్పుడే చర్చించుకున్నారు. ఆ షాక్ తో పోలిస్తే..వై కేటగిరి సెక్యూరిటీ కల్పించడం పెద్ద మ్యాటర్ కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు.

రామచంద్ర యాదవ్ బీజేపీ నేత కాదు.. ప్రస్తుతం జనసేనలో కూడా లేరు. కానీ సొంతంగా రాజకీయ కార్యకలాపాలు చేపడుతున్నారు. బెంగళూరులో మంచి వ్యాపారవేత్తగా ఉన్న ఆయనకు చాలా మంది బీజేపీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన గృహప్రవేశానికి.. బాబా రామ్ దేవ్ సహా చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఆయన పలుకుబడిని తక్కువగా అంచనా వేయలేమని పుంగనూరులో ప్రచారం ఉంది. ఆయన పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి.. పుంగనూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే పుంగనూరు అంటే.. పెద్దిరెడ్డి మార్క్ అరాచకం ఉంటుంది. ఎవరైనా సరే్.. ఆయన వర్గం చేసే దాడులకు గురవ్వాల్సిందే. తగ్గకపోతే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. టీడీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన అనూషారెడ్డి ఆ తర్వాత కంట నీరు పెట్టుకుని ఇక రాజకీయాలు వద్దని వెళ్లిపోయారు. ఆమె అనామకురాలు కాదు.. గట్టి రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళే. అలాంటామే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు రామచంద్రయాదవ్ జనసేనకు దూరంగా ఉన్నా..ఇటీవల రైతు భేరీ పేరుతో ఆయన సభ పెట్టారని చెప్పి ఆయన ఇంటిపై చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఇళ్లపై దాడులు చేసి కొట్టడం సహజంగా మారింది. పుంగనూరులో అయితే ఎక్కువ.

ఈ పుంగనూరు వ్యవహారాన్ని రామచంద్రయాదవ్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించారంటున్నారు. అదే నిజం అయితే.. పుంగనూరులో ఉన్న పరిస్థితుల్ని కేంద్రం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close