జగన్ రెడ్డి చిప్ ఓల్డ్ వెర్షన్. ఎప్పటికీ అప్ డేట్ కాదు. అప్ డేట్స్ చేసుకోవాల్సిన సమయం వచ్చినా చేసుకోరు. పదే పదే ఆ విషయం బయటపడుతూ ఉంటుంది. తండ్రి చనిపోయిన రోజు అని..నివాళి అర్పించడానికి పులివెందుల వచ్చిన ఆయన.. పనిలో పనిగా ఉల్లిపాయ రైతుల్ని పరామర్శించాలని అనుకున్నారు. అలాగే వెళ్లారు. రైతుల్ని పరామర్శించారు. తనకు ఎప్పుడో పదేళ్ల క్రితం రాసిచ్చిన స్క్రిప్టునే రైతులకు చదివి వినిపించాయి. ఆయన పెట్టుకున్న కార్యకర్తలు కూడా అదే కోరస్ వినిపించారు.
హెరిటేజ్ దుకాణాల్లో కిలో ఉల్లి పాయలు 35 రూపాయలుకు అమ్ముతున్నారని రైతులకు పదిహేను రూపాయలు కూడా దక్కడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాలును ఎప్పుడో హెరిటేజ్ గ్రూప్ అమ్మేసింది. అప్పట్లో బిగ్ బజార్ బ్రాండ్ కు చెందిన కిషోర్ బియానీ వాటిని కొన్నారు. ఆ బ్రాండ్ కిందే కొంత కాలం దుకాణాలు నడిచాయి. తర్వాత కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ కొలాప్స్ అయింది. అంతా రిలయన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాలుచాలా వరకూ మాయం అయిపోయాయి.అరకొరగా ఉన్నా అవి రిలయన్స్ బ్రాండ్ కింద నడుస్తున్నాయి.
ఈ వ్యవహారం పదేళ్ల నుంచి జరుగుతూనే ఉంది.కానీ జగన్ రెడ్డికి మాత్రం అవగాహన లేదో.. లేకపోతే పాత స్క్రిప్టే గుర్తుకు వచ్చిందో కానీ అవే ఆరోపణలు చేశారు. ఆయన తననను తాను తెలివిగా ఊహించుకుని ప్రజలు ఏది చెప్పినా నమ్మేస్తారన్న ఓ పిచ్చిలోకంలో బతుకుతూనే ఉన్నారు. ఆయనకు నిజాలు పక్కన ఉన్న వాళ్లు చెప్పరో.. ఆయనను అదే లోకంలో ఉంచితేనే తమకు మంచిదని అనుకుంటారో కానీ.. జగన్ మాత్రం .. అప్ డేట్ కాకుండా అలా ఓల్డ్ చిప్ తోనే కంటిన్యూ అయిపోతున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.