కేసీఆర్‌కు జగన్ రిటర్న్ గిఫ్ట్‌..! వేల కోట్ల ఆస్తులపై హక్కు కోల్పోయిన ఏపీ..!?

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన సెక్రటేరియట్‌లోని ఆరు భవనాలను.. తెలంగాణకు ఇచ్చేస్తూ.. గవర్నర్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నుంచి పరిపాలన కొనసాగిస్తోంది. ఆ భవనాల్లో పెద్దగా కార్యకలాపాల్లేవు. దాదాపు నిరుపయోగంగా ఉన్నాయి. ఆ భవనాలను తమకు అప్పగించాలంటూ… తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు.. ఎప్పుడో కేబినెట్‌లో తీర్మానం చేసింది. దాన్ని గవర్నర్‌కూ అందించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం… సరైన ప్రతిపాదన కాదని పక్కన పెట్టింది. గతంలో గవర్నర్ .. ఇదే అంశంపై.. పదే పదే ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా సాధ్యం కాలేదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడంటే.. మూడు రోజుల్లోనే.. తెలంగాణకు ఇచ్చేస్తూ.. గవర్నర్ నిరభ్యంతరంగా ఆదేశాలు జారీ చేశారు.

జగన్ నుంచి కేసీఆర్‌కు అందిన రిటర్న్ గిఫ్ట్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. టీఆర్ఎస్ బహిరంగ మద్దతు తెలిపింది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ… కేసీఆర్ నేరుగా ప్రకటించడమే కాదు… దాన్ని జగన్ కు గిఫ్ట్ గా మలచడానికి చాలా రకాల సాయాలు చేశారని.. టీడీపీ నేతలు చిట్టా చదువుతూంటారు. ఆ కృతజ్ఞతతోనే… కేసీఆర్‌కు జగన్మోహన్ రెడ్డి…. తాను ముఖ్యమంత్రి అయిన మూడు రోజుల్లోనే రిటర్న్ గిఫ్ట్ ను… సెక్రటేరియట్ భవనాల రూపంలో ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. శరవేగంగా జరిగిన పరిణామాలు చూస్తే అదే నిజమని తేలిపోతోంది.

ఒక్క సెక్రటేరియట్ భవనాలేనా.. యావత్ ఏపీ ఆస్తి మొత్తమా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లోని భవనాలను కేటాయించారు. ఇందుకు కేంద్రం గవర్నర్‌ ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. 2014 మే నెలలో భవనాలను గవర్నర్‌ అధ్యక్షతన గల కమిటీ కేటాయింపులు జరిపింది. జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో కార్యాలయాల స్థలాలూ కేటాయించారు. అందులో భాగంగా సచివాలయంలో జె,కె,ఎల్‌,హెచ్‌ బ్లాక్‌లను ఏపీకి ఇచ్చారు. అలాగే శాసన సభలో పాత భవనాన్ని, జూబ్లిహాలును కేటాయించారు. లేక్‌వ్యూ అతిథి గృహాన్ని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించుకునేందుకు ఇచ్చారు. దీంతోపాటు బూర్గుల రామకృష్ణారావు భవనంలోని దాదాపు 145పైగా శాఖాధిపతుల కార్యాలయాలు, టీఎస్‌ఐఐసీ, సంక్షేమ భవనం, రాష్ట్ర ఆర్థిక సంస్థ, 89 కార్పొరేషన్ల భవనాలు, మంత్రుల నివాస ప్రాంగణాలు, ఎమ్మెల్యేల గృహ సముదాయాలు, వివిధ కార్యాలయాల భవనాలను ఏపీకి బదలాయించారు. గవర్నర్ ఉత్తర్వుల ప్రకారం.. వీటన్నింటినీ .. తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. ప్రతిగా .. రెండు భవనాలను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఆమోదం ఉందో లేదో చెప్పకుండా ఆదేశాలా…?

రాజ్‌భవన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో.. కేసీఆర్, జగన్ గంటకుపైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్‌తోనూ చర్చంచారు. ఆ చర్చల్లో ప్రధానంగా.. విభజన హామీలు.. ఇంకా చెప్పాలంటే.. ఈ సెక్రటేరియట్ భవనాల గురించే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. జగన్‌తో అత్యంత ఆప్యాయంగా ఉంటున్న కేసీఆర్… భవనాల కోసం… చాలా వేగంగా పావులు కదిపారు. చివరికి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఉందో లేదో.. అన్నట్లుగా… పొడి పొడి సమాచారంతో… గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ… భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ మాత్రం… సూటిగా వాక్యాన్ని పొందు పరిచారు. చర్చల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదం లభించిందని… రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. జగన్మోహన్ రెడ్డి… ఏకపక్షంగా ఈ ప్రతిపాదనను అంగీకరించినట్లేనని చెబుతున్నాయి.

నిరుపయోగంగా ఉన్నా… అవి ఆంధ్రప్రదేశ్ ఆస్తి..!

ఆంధ్రప్రదేశ్‌కు… 52 శాతం పరిపాలనా భవనాలను విభజన సమయంలో కేటాయించారు. అంటే అవి అద్దెకు కాదు. ఏపీ సొంతానికి. అవి ఆంధ్రప్రదేశ్ ఆస్తి. పదేళ్ల తర్వాత కూడా.. అవి ఏపీకే ఉంటాయి. ఉమ్మడి రాజధానిగా ఉండకపోవచ్చు. కానీ భవనాలు ఆంధ్రప్రదేశ్ ఆస్తి అని… ఉమ్మడి రాజధానిగా ముగిసిపోయే సమయంలో.. వాటికి సంబంధించినవన్నీ.. తెలంగాణకు ఇచ్చేస్తే.. పరిహారం కోసం… హక్కు ఏపీకి ఉంటుందని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. అందుకే తెలంగాణ సర్కార్ అత్యంత తెలివిగా వ్యవహరించిందని భావిస్తున్నారు. ఇప్పుడు భవనాలు అప్పగించేస్తే.. ఇక ఎప్పుడూ.. ఎలాంటి.. లిటిగేషన్లు లేకుండా.. పోతుంది. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు వస్తాయోనన్న ఉద్దేశంతో… కేసీఆర్.. శరవేగంగా పావుు కదిపారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

రూ. 20 వేల కోట్ల ఆస్తులు ఇచ్చేసిన తర్వాత పరిహారం కోరుతారా..?

ఎలా చూసినా…గవర్నర్ నిర్ణయం… వల్ల ఏపీ ప్రభుత్వానికి రూ. 20 నుంచి 30 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లనుంది. వాటి స్థానంలో రెండు భవనాలను ఏపీకి కేటాయిస్తారు. అవి ఏమిటనేది.. గవర్నర్ అధికారిక ఉత్తర్వుల్లో చెప్పలేదు కాబట్టి.. అది కూడా.. అద్దె ప్రాతిపదికన .. ఉచితంగా వాడుకునే అవకాశాన్ని కల్పిస్తారేమో కానీ… శాశ్వత హక్కులు ఉండవు. ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వం జాలిపడి వాటిని ఇస్తోంది కానీ.. చట్ట ప్రకారం కాదు. ఇప్పుడు… పరిహారం అడుగుతామని… ముఖ్యమంత్రికి చెందిన సాక్షి మీడియాలో ప్రకటిస్తున్నారు కానీ.. ఇచ్చేసిన తర్వాత పరిహారం అనే ప్రశ్న ఎలా వస్తుంది. ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్.. అని బతిమాలుకున్నా.. తెలంగాణ సీఎం ఎందుకిస్తారు..?

మిగతా విభజన సమస్యల పరిష్కారం మాటేమిటి…?

తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుండో ఆ భవనాలు ఇవ్వాలని అడుగుతోంది. కానీ ఏపీ సర్కార్… అన్ని విభజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా.. రూ 6,500 కోట్లకుపైగా పేరుకుపోయిన కరెంట్ బకాయిల దగ్గర్నుంచి… ఉమ్మడి సంస్థల విభజన వరకూ.. అనేక అంశాలు… తేల్చుకుందామని చెప్పింది. వాటిలో ఎలాంటి చర్చలకూ తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. కానీ… జగన్ సీఎం అయిన వెంటనే.. భవనాలు తీసేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close