ఎన్టీఆర్ విల‌నిజం బ‌య‌ట‌ప‌డిపోయిందిగా!

జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ మూడు ర‌కాల పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అందులో జై పాత్ర‌లో నెగిటీవ్ షేడ్స్ ఉండ‌బోతున్నాయ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. అది నిజ‌మే అని రూఢీ అయిపోయింది. రంజాన్ కానుక‌గా…. జై ల‌వ‌కుశ టీజ‌ర్‌ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావించింది. టీజ‌ర్ కూడా క‌ట్ చేసి పెట్టుకొంది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల‌.. ఈద్‌కి టీజ‌ర్ విడుద‌ల చేయలేదు. కానీ ఏమైందో… ఈ టీజ‌ర్ లీకై బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. టీజ‌ర్ ఆసాంతం.. `జై` న‌ట విశ్వ‌రూప‌మే క‌నిపించింది. క‌నిపించిన కాసేపూ.. జై పాత్ర‌లో ఎన్టీఆర్ త‌న హావ‌భావాల‌తో చంపేశాడు. వెనుక‌… దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌తో రెచ్చిపోయాడు. ఈ టీజ‌ర్‌తో ల‌వ‌కుశ‌కి మ‌రింత హైప్ రావ‌డం ఖాయం. అయితే… ఇప్పుడు ఈ టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తారా, లేదంటే ఆస్థానంలో కొత్త టీజ‌ర్ డిజైన్ చేస్తారా అనేది చూడాల్సివుంది. ఎందుకంటే ఇంట‌ర్నెట్ పుణ్య‌మా అని లీకైన గంట‌ల్లోనే.. ల‌వ‌కుశ టీజ‌ర్ అంద‌రికీ చేరిపోయే అవ‌కాశం ఉంది. చూసిన టీజ‌ర్‌నే మ‌ళ్లీ కొత్త‌గా రీలీజ్ చేయ‌డం క‌రెక్ట్ కాదు. అందుకే.. ఆ స్థానంలో కొత్త టీజ‌ర్ ని బ‌య‌ట‌కు తీసుకొచ్చే ఛాన్సుంది. చిత్ర‌బృందం కూడా ”లీకైన టీజ‌ర్ అస‌లుది కాదు. దాన్ని కేవ‌లం ర‌షెస్ కోసం క‌ట్ చేశాం..” అని క్లారిటీ ఇచ్చేసింది. సో.. కొత్త టీజ‌ర్ చూడ‌డం ఖాయం. కాక‌పోతే… ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ విల‌నిజం ఏ స్థాయిలో ఉంటుందో ఈ క‌టింగులు బ‌య‌ట‌పెట్టేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com