క‌మ‌ల్ + ర‌జ‌నీ సినిమా… ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం

చిత్ర‌సీమ‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్‌కు తెర లేవ‌నుందా?? క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ క‌ల‌సి న‌టిస్తున్నారా?? ఈ కాంబోలో తెర‌కెక్కే చిత్రానికి ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా? క‌మ‌ల్‌హాస‌న్ మాట‌లు వింటుంటే అది నిజ‌మే అనిపిస్తోంది. క‌మ‌ల్‌హాస‌న్ బిగ్ బాస్ త‌మిళ వెర్ష‌న్‌కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా చెన్నైలో క‌మ‌ల్ మీడియాతో మాట్లాడుతూకొన్ని ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తులు చెప్పుకొచ్చారు. ర‌జ‌నీ తాను క‌ల‌సి న‌టిస్తే.. అంద‌రికీ చూడాల‌ని వుంద‌ని, ఆ కోరిక త‌మ ఇద్ద‌రిలోనూ ఉంద‌న్న సంగ‌తి బ‌య‌ట‌పెట్టాడు క‌మ‌ల్‌హాస‌న్‌. ”మా ఇద్ద‌రి కెరీర్ ఇంచుమించు ఒకేలా ప్రారంభ‌మైంది. ఇద్ద‌రం క‌ల‌సి కొన్ని చిత్రాల్లో న‌టించాం. ఇప్పుడు మ‌ళ్లీ క‌ల‌సి న‌టించాల‌నుకొంటున్నాం. గ‌త ఐదేళ్లుగా త‌గిన క‌థ కోసం ఎదురుచూస్తున్నాం” అన్నాడు క‌మ‌ల్‌. అంతేకాదు.. ఆసినిమాకి ర‌జ‌నీకాంత్‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని, కాని ప‌క్షంలో ఆ బాధ్య‌త తానే తీసుకొంటాన‌ని చెప్పుకొచ్చాడు క‌మ‌ల్‌.

క‌మ‌ల్ – ర‌జ‌నీ ఆప్త మిత్రులు. ఇద్ద‌రికీ గురువు ఒక్క‌రే… ఆయ‌నే బాల‌చంద‌ర్‌. అయితే ఆమ‌ధ్య ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ పెరిగింది. సామాజిక‌, రాజకీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా ఎడ‌మొహం పెడ‌మొహంగానేఉన్నారు. అయితే ఎందుక‌నో ఈమ‌ధ్య ర‌జ‌నీకాంత్ కి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చూస్తున్నాడు క‌మల్‌. అందులో భాగంగానే ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసి ఉండొచ్చ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం క‌మ‌ల్ దృష్టి విశ్వ‌రూపం 2 సినిమా పై ప‌డింది. దీన్ని వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేద్దామ‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close