‘సత్యం సుందరం’ తర్వాత కార్తి నుంచి సినిమా రాలేదు. సర్దార్ 2 షూటింగ్ లో వుంది. ఈ గ్యాప్ లో ‘అన్నగారు వస్తారు’ టైటిల్ తో మరో సినిమాని రెడీ చేశారు. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. నలన్ కుమారస్వామి దర్శకుడు. కృతిశెట్టి హీరోయిన్.
తాజాగా టీజర్ వదిలారు. ఇందులో డైలాగ్స్ లేవు కానీ దాదాపు అన్ని పాత్రలని చూపించారు. కార్తి ఇందులో పోలీస్ గా కనిపిస్తున్నారు. టీజర్ వీడియో కోసం సంతోష్ నారాయణ్ మంచి డ్యాన్స్ బీట్ ని కంపోజ్ చేశాడు. ఓ జాతరలో కార్తి డ్యాన్స్ చేయడం, అదే బీట్ లో పాత్రలన్నీ రివిల్ చేయడం ఆసక్తికరంగా వుంది.
ఈ మధ్య కాలంలో తమిళ సినిమాలు సరైన తెలుగు టైటిల్ పెట్టడంలో విఫలమౌతున్నాయి. కాకపొతే కార్తికి తెలుగు ఆడియన్స్ మీద గౌరవం వుంది. మరీ పడికట్టు డబ్బింగ్ టైటిల్స్ లా కాకుండా క్యాచి టైటిల్స్ ఆయన సినిమాలకి పెడుతుంటారు. అన్నగారు అనేది తెలుగులో చాలా పాపులర్ మాస్ టైటిల్. మంచి టైటిలే ఎంచుకున్నారు. సరైన ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకెళ్తే వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు వున్నాయి.