బ‌తుక‌మ్మ సంబ‌రాల‌తో క‌విత మ‌ళ్లీ యాక్టివ్..!

పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రిగిన త‌రువాతి నుంచి రాజ‌కీయంగా యాక్టివ్ గా లేరు మాజీ ఎంపీ, ముఖ్య‌మంత్రి కుమార్తె కె. క‌విత‌. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఆ త‌రువాత‌, పార్టీ ఓట‌మిపై స‌మీక్ష కూడా ఆమె చెయ్య‌లేదు. చివ‌రికి, ఆ మ‌ధ్య తెరాస అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో కూడా ఆమె పాల్గొన‌లేదు. సొంత నియోజ‌క వ‌ర్గం నిజామాబాద్ వైపు క‌న్నెత్తి కూడా ఆమె చూడ‌లేదు! ఎమ్మెల్సీని చేసి కేబినెట్ క పంపిస్తార‌నే చ‌ర్చ కొన్నాళ్లు జ‌రిగితే, రాజ్య‌స‌భ‌కు పంపించాల‌నే సీఎం కేసీఆర్ ఉన్నార‌నే క‌థ‌నాలు వచ్చాయి. ఏదేమైనా ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఆమె కామ్ గా ఉంటున్నారు. పార్టీ త‌ర‌ఫున ఇంత‌వ‌ర‌కూ ఆమె మాట్లాడిందీ లేదు, మీడియా ముందుకొచ్చి స్పందించిందీ లేదు. ఇప్పుడు బ‌తుక‌మ్మ సంబ‌రాల‌ను జ‌న జాగృతి త‌ర‌ఫున నిర్వ‌హించేందుకు ఆమె సిద్ధ‌మౌతున్నారు.

చాన్నాళ్ల త‌రువాత ఓ మీడియా ప్ర‌క‌ట‌న‌లో క‌విత మాట్లాడుతూ… సెప్టెంబ‌ర్ 28 నుంచి బ‌తుక‌మ్మ సంబ‌రాలు ప్రారంభ‌మౌతాయ‌నీ, అక్టోబ‌ర్ 6న స‌ద్దుల బ‌తుక‌మ్మ‌ల‌తో ఈ సంబ‌రాలు ముగుస్తాయ‌న్నారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం మారిదిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో పండుగ జ‌రుగుతుంద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌తోపాటు, విదేశాల్లో కూడా బ‌తుక‌మ్మ సంబ‌రాలు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

బతుక‌మ్మ‌ల‌తో మ‌రోసారి యాక్టివ్ అవుతున్నారు క‌విత‌. అయితే, ఈ పండుగ‌కే ప‌రిమితం అవుతారా… ఆ త‌రువాత‌, రాజ‌కీయంగా కూడా క్రియాశీలంగా మారే ప్ర‌య‌త్నాలు చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ పండుగ విష‌యానికొస్తే… రాష్ట్రంలో భాజపా కూడా ఈ సంబ‌రాల‌కు సిద్ధ‌మౌతోంది. కేంద్ర మ‌హిళా మంత్రుల్ని అతిథులుగా రాష్ట్రానికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో వారున్నారు. బ‌తుక‌మ్మ‌ల సెంటిమెంట్ తెరాస‌కు రాజ‌కీయంగా బాగా క‌లిసొచ్చింది. అదే బాట‌లో భాజ‌పా కూడా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ఏడాది బ‌తుక‌మ్మ‌ల ఉత్స‌వాల‌ను ఘ‌నం నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం రాజ‌కీయంగా తెరాస‌కు అవ‌స‌ర‌మ‌నే చెప్పాలి. కాబ‌ట్టి, క‌విత మ‌రింత క్రియాశీలం కావాల్సిన అవ‌స‌రముంది. లోక్ స‌భ ఎన్నిక‌ల ఓట‌మి నుంచి ఇక‌నైనా తేరుకుంటారా, దీనికి కొన‌సాగింపుగా రాజ‌కీయంగా మ‌రింత క్రియాశీలం అవుతారా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close