తెలంగాణ రాత మార్చిన నేత..! నేడు కేసీఆర్ బర్త్ డే..!

తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్ అరవై ఎనిమిదో పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం మొత్తం ఆయనకు కోటి మొక్కలు నాటి ప్రత్యేకమైన కానుకను ఇవ్వాలనుకుంటోంది. తెలంగాణ అనే మాట వినిపిస్తే ముందుకు గుర్తుకు వచ్చేది కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అన్నంతగా స్వరాష్ట్ర ఉద్యమాన్ని శ్వాసించిన ఆయన… ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. వెనక్కి తగ్గకుండా.. వెరవకుండా పోరాడి.. అంది వచ్చి న అవకాశాల్ని ఉద్య మసోపానాలుగా మార్చుకుని కోట్లాది మంది తెలంగాణ ప్రజల స్వాప్నాన్ని సాకారం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టి.. తెలంగాణ ప్రజానీకాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలపై యుద్ధం ప్రారంభించారు.

ముందుగా సాగు, తాగునీటిపై దృష్టి సారించారు. మిషన్ భగీరథతో పాటు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో .. ఆ సమస్యను దాదాపుగా పరిష్కరించేశారు. ఇప్పుడు.. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పొలాలకు సాగునీరు సౌకర్యం కనిపిస్తోంది. ఏ మరుమూల గ్రామానికి వెళ్లినా ప్రజలకు తాగునీరు అందుతోంది. భారత దేశంలో నల్లా కలెక్షన్లు వంద శాతం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిదయిందంటే.. .అది కేసీఆర్ ముందు చూపే. నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్‌ను తరిమేసినా… పారిశ్రామిక వృద్ధిలో తెలంగాణ పరుగులు పెట్టినా…కేసీఆర్ పట్టుదల… సిద్ధించిన స్వరాష్ట్రాన్ని గొప్పగా ఆవిష్కరించాలన్న తపనే కారణం.

కేసీఆర్ తన రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా చూడాలని అనుకుంటున్నారు. అందుకే ప్రతీ ఏడాది హరిత హారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో చెట్ల సంరక్షణ కోసం కఠినమైన నిబంధనలు పెట్టారు. కేసీఆర్ స్వయంగా రైతు కూడా. అందుకే కేసీఆర్ అరవై ఏడో పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు… కార్యకర్తలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు..పుట్టిన రోజు నాడు కేసీఆర్‌కు అమితంగా ఆనందాన్ని ఇచ్చే కానుకను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. కోటి వృక్షార్చన నిర్వహించబోతున్నారు.

సీఎం కేసీఆర్‌కు ఆర్భాటంగా పుట్టిన రోజులు జరుపుకోవడం అలవాటు లేదు. ఆయన కుటుంబసభ్యులతో ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తారు. అయితే పార్టీ నేతలు మాత్రం ప్రతీ గల్లీలో తమ అభిమాన నేత పుట్టిన రోజును పండుగలా చేరుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close