చైతన్య : ఆర్టీసీని రైట్ ట్రాక్‌లో పెడుతున్న కేసీఆర్..!

ఇప్పుడు అందరూ ఆర్టీసీ సమ్మె గురించే మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగులపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాల గురించే చర్చించుకుంటున్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోమన్న సంకేతాన్ని కేసీఆర్ పంపుతున్నారు. విపక్షాలు. ఆర్టీసీ ఆస్తుల దగ్గర్నుంచి గతంలో.. ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసినప్పటి పరిస్థితుల గురించి వివరిస్తూ… తెలంగాణ సీఎం… అన్యాయం చేస్తున్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఇప్పుడు ఇలా కఠినంగా వ్యవహరించకపోతే… ఆర్టీసీ మరిన్ని అప్పుల్లో కూరుకుపోతుంది. ఆ తర్వాత.. ఉద్యోగులు రోడ్డున పడతారు. అప్పుడు ప్రభుత్వానికి మరింత భారం అవుతుంది.

ఆర్టీసీని కాపాడుకోవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు..!

రాంగ్ రూట్లో వెళ్తున్నాడని భారీ జరిమానాలు విధించడం కరెక్ట్ కాదని కొందరి వాదన.. అయితే అదే రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రమాదానికి గురైతే.. ఎవరికి నష్టం..?. అలా ఎవరూ రాంగ్ రూట్లోకి వెళ్లకుండా ఉండటానికి ప్రభుత్వాలు తన వంతు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆర్టీసీ ట్రాక్ తప్పకుండా ఉండటానికి కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే కేసీఆర్‌పై … నియంతలా వ్యవహరిస్తున్నారన్న వాదనను ప్రతిపక్షం తెరపైకి తెచ్చింది. హుజూర్ నగర్ ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో ప్రభుత్వం.. సున్నితమైన ఆర్టీసీ సమస్యపై ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. కానీ రాజకీయ ప్రయోజనాల కన్నా.. ఆర్టీసీ ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ గుర్తించారు. ఆర్టీసీని కాపాడుకోవాలంటే.. కఠినంగా వ్యవహరించక తప్పదని నిర్ణయించుకున్నారు.

ఉద్యోగుల తీరుపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత..!

ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో సాధారణంగా కాస్తంత వ్యతిరేకత ఉంటుంది. లంచాలు తీసుకుంటారని… తాము కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ తమను వేధిస్తూంటారని సామాన్య ప్రజలకు ఓ అభిప్రాయం ఉంది. కేసీఆర్ దీన్ని గుర్తించారు. ఉద్యోగుల్ని మంచి చేసుకునేదుకు వారికి తాయిలాలు ప్రకటించడం కన్నా… వారి విషయంలో కఠినంగా ఉండి ప్రజల మద్దతు పొందడం సులువని అంచనా వేసుకున్నారని చెబుతున్నారు. అందుకే.. కొంత కాలంగా.. ప్రభుత్వ శాఖల్లో అత్యధికంగా అవినీతి ఉంటుందనే అభిప్రాయం ఉన్న రెవిన్యూ శాఖను టార్గెట్ చేశారు. ఇప్పుడు.. ఆర్టీసీ కార్మికుల వంతు అయింది. ఆర్టీసీ వేల కోట్ల నష్టాల్లో ఉన్నా.. కార్మికులు… బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. కేసీఆర్ అంటున్నారు. ఒక్కో ఉద్యోగి యాభై వేలకు పైగా జీతం తీసుకుంటున్నా… ఇంకా కావాలని అంటున్నారని చెబుతూ… వారిపై వేటు వేశారు. దీంతో సహజంగానే.. ఆర్టీసీ ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని… వారి విషయంలో కేసీఆర్ కరెక్ట్ చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. వారికి దండిగానే జీతాలు అందుతున్నాయని ప్రజలు కూడా ఓ అంచనాకు వచ్చారు.

కేసీఆర్ చెప్పినట్లుగా చెస్తే లాభాల్లోకి ఆర్టీసీ..!

ఉద్యోగులు సమర్థంగా పని చేస్తే.. పాలనకు తిరుగు ఉండదు. వారు తీసుకుంటున్న జీతాలకు తగ్గట్లుగా పని చేస్తే.. బంగారు తెలంగాణ సాకారం అవుతుంది. తెలంగాణ వచ్చిన వెంటనే అందరికీ దండిగా జీతాలు పెంచిన కేసీఆర్ అదే మాట చెప్పారు. కానీ ఉద్యోగుల్లో మార్పు రాలేదు. దాంతో కేసీఆర్.. వ్యవస్థలో మార్పు తీసుకు రావడానికి ఉద్యోగులను సంస్కరించడానికి తన వంతు అడుగు ముందుకేశారు. ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా వెనుకడుగు వేయడం లేదు. ఉద్యోగులు ఇక ఆర్టీసీకి లేరన్నట్లుగా వ్యవహరిస్తూనే… కొత్త నియామకాలు.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో.. బస్సులు ఇలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేసీఆర్ చర్యలు ఫలించి.. ఆర్టీసీ లాభాల్లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close