కమ్యూనిస్టులతో పొత్తు ఖరారు చేసుకున్న కేసీఆర్ !

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయడం లేదు. కమ్యూనిస్టులతో పొత్తు ఖరారు చేసుకున్నారు. ముందుగా కమ్యూనిస్టులు మునుగోడులో టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తారు. మునుగోడులో టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో .. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు పొందేందుకు ప్లాన్ చేసింది సీపీఐ. తెలంగాణ సీపీఐ పార్టీ మునుగోడులో కీలకంగా ఉంది. అక్కడ ఆ పార్టీకి కనీసం ఇరవై వేల ఓటింగ్ ఉంటుందని అంచనా. ఈ క్రమంలో ఆ పార్టీ మద్దతు కోసం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు.

కేసీార్ ఆతృత అర్థం చేసుకున్న సీపీఐ పక్కాగానే బేరం ఆడింది. ఈ ఉపఎన్నికల్లో తాము మద్దతిస్తాం.. కానీ వచ్చే ఎన్నికల సంగతేమిటని ప్రశ్నించింది. దానికి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగిద్దామని భరోసా ఇచ్చారు. దీనికి అంగీకరించిన సీపీఐ నేతలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఇది మునుగోడుకే పరిమితం కాదని, భవిష్యత్‌లో కూడా టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. గత ఎన్నికల్లో మహా కూటమితో పోటీ చేసిన సీపీఐకి మూడు సీట్లు కేటాయించారు.అయితే మూడు సీట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేశారు. దాంతో సీపీఐ హర్ట్ అయింది.

వచ్చే ఎన్నికల్లో కనీసం కేసీఆర్ మూడు సీట్లయినా కేటాయిస్తే చాలనుకుంటోంది. మునుగోడులో పోటీ చేసినా గెలిచే చాన్స్ లేకపోవడంతో.. అక్కడ తమకు ఉన్న బలాన్నే ఉపయోగించుకుంది. ఇప్పటికి అయితే కేసీఆర్ భవిష్యత్‌లోనూ పొత్తుకు ఓకే అంటారు కానీ… అసలైన ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి ఏమంటారో చెప్పలేమని రాజకీయ వర్గాలంటున్నాయి. అయితే కేసీఆర్‌పై సీపీఐ తెలంగాణ నేతలు నమ్మకం పెట్టుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close