కోకాపేటలో బీఆర్ఎస్‌కు 11 ఎకరాలిచ్చిన కేసీఆర్ ప్రభుత్వం !

కోకాపేట అంటే ఎకరం వంద కోట్లు పలికే ప్రాంతం. అలాంటి చోట భారత రాష్ట్ర సమితికి ఏకంగా పదొకొండు ఎకరాలు రాసిచ్చేశారు సీఎం కేసీఆర్. అత్యంత సీక్రెట్ గా జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. రూ.6000 కోట్ల విలువైన స్థలాన్ని.. కేవలం రూ.37.53 కోట్లకే ముట్టజెప్పేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. కొత్త సెక్రటేరియెట్​లో గురువారం జరిగిన కేబినెట్​ మీటింగ్​లో అత్యంత రహస్యంగా ఈ ఫైల్ క్లియర్ అయిపోయింది. కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు కూడా బీఆర్ఎస్​కు 11 ఎకరాల భూమిని కేటాయించిన విషయం మాట మాత్రమైనా ప్రస్తావించలేదు.

అధికార పార్టీ వ్యవహారం కావడంతో ఫైల్ పంపించడం, ఆమోదం తెలపడం, సర్క్యులర్ జారీ కావడం.. అంతా సీక్రెట్ గా జరిగిపోయాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు బీఆర్ఎస్‌కు ఈ స్థలం ఎందుకు అంటే..కాలేజీ పెడుతుందట. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెలవప్మెంట్ పెడతామని పదకొండు ఎకరాలు కావాలని బీఆర్ఎస్ వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. అంత కంటే కావాల్సిదేమని రంగారెడ్డి జిల్లా గం కలెక్టర్.. కోకాపేటలో 239, 240 సర్వే నంబర్లలోని 11 ఎకరాల జాగను హెచ్​ఎండీఏ ద్వారా ఇప్పించాలని ఈ నెల 16న సీసీఎల్​ఏకు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు వచ్చిన మర్నాడే 17 వ తేదీన సీసీఎల్ఏ ఆ ఫైల్ ను తెలంగాణ స్టేట్ డెలవప్ మెంట్ అధారిటీకి పంపింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే బీఆర్ఎస్ కు భూమి అప్పగించాలని అధారిటీ సిఫారసు చేసింది. శుక్రవారం బీఆర్ఎస్‌కు కు అతి తక్కువ ధరకు భూమిని కట్టబెడ్తూ సర్క్యులర్ వచ్చింది.

గతంలో పార్టీ ఆఫీసుల కోసం కూడా ఇలా అత్యంత విలువైన భూముల్ని బీఆర్ఎస్‌కు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు పార్టీ ఆఫీసుకు బదులుగా ఇనిస్టిట్యూట్ పెడతామని ప్రభుత్వం స్థం తీసుకోవడం.. అదీ కూడా గుట్టు చప్పుడు కాకుండా కేటాయింపులు పూర్తయిన తర్వాత బయటకు తెలియడం చర్చనీయాంశం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close