కేసీఆర్‌కు “రైతు బంధు” కష్టం..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. ఏటా రెండు సార్లు… నిధుల సమస్య వస్తుంది. మిగతా వాటి సంగతేమో కానీ.. రెండో సారి అధికారంలోకి తెచ్చిన పథకం రైతు బంధు అమలు చేయడానికి కేసీఆర్ … కష్టాలు పడాల్సి వస్తోంది. రెండో సారి గెలిచిన తర్వాత ఆ పథకం అమలులో ఆలస్యం జరుగుతోంది. పంటల సీజన్లు ప్రారంభమయ్యే నాటికి అందించలేకపోతున్నారు. మొదట్లో పంపిణీ చేసినట్లుగా ఒకేసారి మీట నొక్కడం ద్వారానో.. చెక్కుల ద్వారానో.. పంపిణీ చేయడం లేదు. విడుతల వారీగా పంపిణీ చేస్తున్నారు.

ప్రభుత్వం రైతు బంధు సాయం చేయడమే ఆలస్యం అయితే… ఇలా పంపిణీలోనూ… వాయిదాల పద్దతి పాటించడం రైతుల్లో అసహనానికి కారణం అవుతుందని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏపీ సర్కార్.. అనేకానేక సంక్షేమ పథకాలను … జగన్మోహన్ రెడ్డి మీట నొక్కి విడుదల చేస్తూంటారు. అలా కేసీఆర్ కూడా ఒకే సారి లబ్దిదారుల అకౌంట్లలో నగదు జమ చేయాలని వారు కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్‌కు ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉంది. కావాలంటే.. ఆర్బీఐ వద్దకు వెళ్లి అప్పులుతీసుకుని రైతుల ఖాతాల్లో వేసేయవచ్చు. అలాచేయడం… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది. దీని గురించితెలుసు కాబట్టే కేసీఆర్… సొంత ఆదాయవనరుల ద్వారా సమీకరించి.. రైతులకు అందిస్తున్నారు.

ఆర్థిక కష్టాలతో.. ఎప్పటికప్పుడు నగదును సర్దుబాటు చేసుకుని.. రైతు బంధు నిధులు చెల్లిస్తున్నారని.. ఒకే సారి జమ చేయడం సాధ్యం కాదన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. ఈ ఏడాది వర్షాకాలం పంటల సీజన్‌ కోసం.. జూన్ పదో తేదీ నుంచి రైతు బంధు పంపిణీ ప్రారంభిస్తారు. పది రోజుల పాటు సాగుతుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఎదురు చూసేలా కాకుండా… పక్కాగా వేస్తే… పథకం ప్రయోజనం ఉంటుందని లేకపోతే.. రైతుల్లో ఆగ్రహం కనిపిస్తుందని… టీఆర్ఎస్ నేతలు… ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ పంపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దక్షిణాదిపై మోదీ ఆశలు !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతీ విడత పోలింగ్ జరిగే ముందు మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఐదో విడత పోలింగ్ కు ముందు ఇచ్చిన ఇంటర్యూల్లో ఎక్కువగా దక్షిణాది గురించి చెప్పారు. దక్షిణాదిలో తాము...

‘ర‌ణ‌భాలీ’గా రౌడీ దేవ‌ర‌కొండ‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ - రాహుల్ సంకృత్యాన్ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 'ర‌ణ‌భాలీ' అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదో పిరియాడిక్ యాక్ష‌న్ డ్రామా....

‘హ‌రోం హ‌ర‌’.. కాస్త ఆల‌స్యంగా!

ఈనెల 31న రావాల్సిన సినిమా 'హ‌రోం హ‌ర‌'. అయితే అదే రోజున నాలుగైదు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అందుకే 'హ‌రోం హ‌ర‌' ఈ పోటీ నుంచి త‌ప్పుకొంది. జూన్ 14న వ‌స్తున్న‌ట్టు చిత్ర‌బృందం...

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close