సీట్ల గోల లేకుండానే కోదండరాం మద్దతు పొందిన రేవంత్ !

కాంగ్రెస్‌, కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్‌ కలిసి పని చేయాలని నిర్ణయించాయి. కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తే ప్రొఫెసర్‌ కోదండరాంకు, తెలంగాణ ఉద్యమ అనుచరులకు సముచిత స్థానం కల్పించ నున్నట్టు కాంగ్రెస్‌ తెలిపింది. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, ప్రజా పరిపాలన నెలకొల్పడానికి మద్ధతివ్వాలని టీజేఎస్‌ను కాంగ్రెస్ కోరింది. కోదండరామ్‌ తన అనుభ వాన్ని కేసీఆర్‌ నిరంకుశ పాలన అంతమొందించడా నికి,స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి సాధన కోసం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్‌ నిరంకుశ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్‌ పార్టీకి మద్ధతిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక విధాన రూపకల్పనలో ఆరు అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. అందరికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించా లనీ, ఉపాధి, ఉద్యోగాల కల్పన ప్రధాన లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలని ఆకాంక్షిం చారు. ఏ ఏడాది ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను అదే ఏడాది క్యాలెండర్‌ ప్రకారం భర్తీచేయాలనీ, స్థానిక ప్రయివేట్‌ పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో భూమి పుత్రులకు అవకాశాలు కల్పించాలన్నారు. వాస్తవ సాగుదారులందరికీ, ప్రత్యేకించి చిన్న, సన్న, కౌలు రైతుల ఆదాయ భద్రత సాధించడంతో పాటు వీరి భూమి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో రాజ్యాంగ ప్రాతిపదికన ప్రజాస్వామిక పాలనను నెలకొల్పాలనీ, కేసీఆర్‌ అవినీతి చర్యలపైన విచారణ జరపాలనీ, పౌరులంద రికి ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు, మైనార్టీలకు, పేద వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ వారి సంక్షేమం కోసం విధానాలు రూపొం దించాలన్నారు. వీటన్నింటికీ రేవంత్ రెడ్డి అంగీకరించారు. పాలనలో కోదండరాంకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమకారులు … కోదండరాం వల్ల కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close