‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు’

హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానానికి తమ పార్టీకి తెలుగుదేశం మద్దతిస్తుందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన తరపున నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ ఈ ఎన్నికల్లో నల్గొండతో సహా 4 లేదా 5 సీట్లు గెలుచుకుంటామని అన్నారు. ఈ ఎన్నికలు 2019 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని చెప్పారు. వామపక్షాలు తమకు మద్దతిచ్చాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. అదిలాబాద్ అభ్యర్థిగా మహేశ్వరరెడ్డి, నిజామాబాద్ అభ్యర్థిగా వెంకటరమణారెడ్డిని, రంగారెడ్డి అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close