హైదరాబాద్ సౌత్ లో కొంగరకలాన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా చూస్తున్న ప్రాంతంగా మారింది. ఆదిభట్ల , రావిర్యాల మధ్యలో ఉండటంతో రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ, వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, రంగారెడ్డి కలెక్టరేట్, టాటా ఏరోస్పేస్ పార్క్, అమెజాన్ డేటా సెంటర్ – ఇవన్నీ రెండు నుంచి పది కిలోమీటర్ల లోపే ఉన్నాయి. ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 20-25 నిమిషాల దూరంలో ఉంటుంది.
గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ల్యాండ్ రేట్లు దాదాపు 45-50 శాతం పెరిగాయి, పదేళ్లలో మూడింతలు అయ్యాయి. ప్రస్తుతం ఒక చదరపు గజం రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఉంటే, మెయిన్ రోడ్ ఫేసింగ్‌లో రూ.40,000 వరకు ఉంటోంది. ఇప్పుడు ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు బాగా ఉన్నాయి. ఒకటి ఓపెన్ ప్లాట్లు – 150 నుంచి 300 చదరపు గజాల ప్లాట్ రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు దొరుకుతోంది. రెండు, గేటెడ్ కమ్యూనిటీల్లో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు – రూ.45 లక్షల నుంచి రూ.85 లక్షల రేంజ్లో అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ ఉండే వాళ్లకు రోజువారీ అవసరాలు కూడా ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు, ఎల్ అండ్ టీ మాల్ – అన్నీ 5 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. రాత్రిపూట కూడా స్ట్రీట్ లైట్స్, సీసీటీవీలు బాగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే, ఇక్కడ రూ.50-70 లక్షల పెట్టుబడి పెడితే 5-7 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందని రియల్టర్లు, ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మధ్యతరగతి కుటుంబం అయినా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా – కొంగరకలాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అతి మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.

