బన్నీ ఒక్క‌డే బాకీ

ర‌చ‌యిత రాణించి, ఆ త‌ర‌వాత కెప్టెన్ కుర్చీలో కుర్చున్న‌వాళ్లు చాలామంది ఉన్నా, రాణించిన‌వాళ్లు త‌క్కువే. త్రివిక్ర‌మ్ త‌ర‌వాత‌.. ఆ స్థాయిలో హిట్లు కొట్టిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. తొలి ప్ర‌య‌త్న‌మే ప్ర‌భాస్‌తో. ఆ త‌ర‌వాత ఇక వెనుదిరిగి చూడాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఎన్టీఆర్‌తో ఓసినిమా, మ‌హేష్‌తో రెండు సినిమాలూ పూర్తి చేసేశాడు కొర‌టాల‌. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో చ‌ర‌ణ్ కూడా ఉన్నాడు. సో.. ఒకేసారి ఇద్ద‌రు హీరోల్ని డీల్ చేస్తున్నాడన్న‌మాట‌. ఈత‌రం స్టార్ హీరోల్లో ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్‌… అంద‌రితోనూ ప‌నిచేశాడు. ఇక మిగిలింది అల్లు అర్జున్ మాత్ర‌మే.

కొర‌టాల నెక్ట్స్ టార్గెట్ కూడా బ‌న్నీనే. ఇది వ‌ర‌కే బ‌న్నీతో ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపాడు కొర‌టాల‌. ఎట్ట‌కేల‌కు ఈ కాంబో సెట్ట‌య్యింది. బ‌న్నీతో కొర‌టాల సినిమా ఖాయ‌మైంది. బ‌హుశా.. పుష్ష త‌ర‌వాత ప‌ట్టాలెక్కే బ‌న్నీ సినిమా ఇదే కావొచ్చు. పుష్ష‌తో పాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేస్తున్నాడు అల్లు అర్జున్‌. కొర‌టాల సినిమా కూడా అదే స్థాయిలో ఉండ‌బోతోంద‌ట‌. బ‌న్నీతో సినిమా చేస్తే.. ఈ త‌రం టాప‌ర్స్ అంద‌రితోనూ ఓ రౌండ్ వేసిన‌ట్టు అవుతుంది. ప్ర‌భాస్‌తో కొర‌టాల మ‌రో సినిమా చేస్తాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి అదెప్పుడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close