భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే పిచ్చెక్కిపోతారు ఫ్యాన్స్. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాబట్టి ఇంకా ఎక్కువ హైప్ ఉండాలి .కానీ ఆదివారం భారత్, పాక్ మధ్య ఆసియా కప్ మ్యాచ్ ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ టీ ట్వంటీ మ్యాచ్ జరగబోతోంది. కానీ అంత హైప్ కనిపించడం లేదు. పాక్తో ఎలా ఆడతారని కొంత మంది వివాదం రేపినా ఎవరూ పట్టించుకోలేదు.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా, సల్మాన్ అలీ కెప్టెన్సీలో పాకిస్తాన్ తలపడనున్నాయి. ఆసియా కప్ చరిత్రలో భారత్-పాకిస్తాన్ మధ్య 19 మ్యాచ్లు జరిగాయి. భారత్ 10 విజయాలు, పాకిస్తాన్ 6 విజయాలు సాధించాయి. మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. T20Iలలో మొత్తం 13 మ్యాచ్లలో భారత్ 10 విజయాలు, పాకిస్తాన్ 3 విజయాలు నమోదు చేశాయి. గత 5 సంవత్సరాల్లో 5 T20Iలలో భారత్ 3 గెలిచింది.
పాకిస్తాన్ టీం బలహీనంగా ఉండటం.. భారత్ బలంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితంపై ఎక్కువ మంది ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ క్రికెట్ మ్యాచ్ ఫలితాలను అంచనా వేయడం.. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం లాంటిదే. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మధ్య ఉండాల్సింత హీట్ మాత్రం కనిపించడం లేదు. ఆదివారం కాబట్టి.. మ్యాచ్ ను రికార్డు స్థాయిలో ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది.


