మీడియా మరక : నిమ్మగడ్డకు అంత గౌరవం ఎందుకో…?

సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్..! . ..

ఈ వార్త.. మామూలుగా అయితే.. బ్లాస్టింగ్ న్యూస్. ఓ వ్యాపారవేత్తను విదేశాల్లో అరెస్ట్ చేయడం అంటే.. అంత సామాన్యమైన విషయం కాదు. ఏదో పెద్ద నేరం చేసి ఉంటేనే.. అరెస్ట్ చేశారు. పైగా ఆయనపై ఇండియాలో కేసులు ఉన్నప్పటికీ… విదేశాల్లో .. అదీ విదేశీ పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ అరెస్టయ్యారంటే.. దేశం పరువు తీసే పని ఏదో చేసినట్లే భావించాలి. కానీ.. తెలుగు మీడియా.. ఆయనకు.. అత్యంత గౌరవం ఇచ్చింది. ఈ న్యూస్‌ను టీవీ ప్రేక్షకులు చూసీచూడనట్లు ఇచ్చారు. కొన్ని చానళ్లలో అసలు రాలేదు. శివాజీకి ఉన్నంత విలువ.. ఈ వార్తకు లేదు. నిమ్మగడ్డకు అత్యంత గౌరవం ఇచ్చారు.

మామూలుగా చిన్న చిన్న విషయాల్లో మీడియా చేసే హడావుడి చాలా ఎక్కువగా ఉంది. ఓ వ్యక్తిని దుబాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి పంపేశారంటే.. గంటల తరబడి కథనాలు ప్రసారం చేసిన మీడియా తెలుగులో ఉంది. నిమ్మగడ్డ విషయంలో మాత్రం.. మీడియా సంయమనం పాటించింది. సెర్బియా పోలీసులు.. నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారని ఖచ్చితమైన సమాచరం తెలిసిన తర్వాత .. మొహమాటానికి మాత్రం.. టీవీ9 ఓ సారి చెప్పింది. తర్వాత అది కూడా లేదు. అదే సాక్షి టీవీలో అయితే.. దీనిపైన కనీస సమాచారం కూడా లేదు. నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహారం మాత్రం దేశ ప్రతిష్టకు సంబంధించిన ఆయన రస్ అల్ ఖైమా అనే ఓ దేశాన్నే మోసం చేశారు. పెట్టుబడులు తీసుకుని.. ఇప్పుడు తనకు సంబంధం లేదంటున్నారు. ఈ కేసులో.. తీగ లాగితే.. ఎన్నో డొంకలు బయటపడతాయి. ఇలాంటి కేసు విషయంలో… హడావుడి చేయాల్సిన మీడియా… సైలెంటయిపోయింది.

పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిన తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా వికృతరూపంలో.. మంగళవారం మరోసారి బయట పడినట్లయింది. తమకు ఇష్టం లేని వ్యక్తుల్ని టార్గెట్ చేయడానికి.. ఇష్టారాజ్యంగా వాడుకుకుంటున్న సదరు.. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ మీడియా… నిమ్మగడ్డ నిజంగా.. సెర్బియాలో అరెస్టయినప్పటికీ.. చెప్పడానికి మొహమాట పడింది. ఆయనతో.. ఆయా మీడియా యజమానులకు ఉన్న వ్యాపార ఒప్పందాలు, ముఖ పరిచయాలు.. అంతకు ముందు జరిగిన తెర వెనుక లావాదేవీలు దీనికి కారణం అయి ఉండవచ్చు. అదే నిజమైతే.. తెలుగు మీడియా ఇక ప్రైవేటు వ్యాపారుల ప్రయోజనాల కోసమే.. పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్లుగా భావించాలి. అంటే తెలుగు మీడియాకు అర్థం మారిపోయినట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close