ఇక యుద్ధమే..! టాలీవుడ్‌కు మీడియా హెచ్చరికలు..!!

శ్రీరెడ్డి అనే నటీమణి.. తెలుగులో తెలుగు వాళ్లకే అవకాశాలు కల్పించాలన్న డిమాండ్‌తో ప్రారంభించిన ఉద్యమం.. అటూ ఇటూ తిరిగి చివరికి టాలీవుడ్ – మీడియా మధ్య యుద్ధంగా రూపాంతరం చెందుతోంది. మే రెండో తేదీ నుంచి… నాలుగు మీడియా చానళ్లు ఫుటేజీతో పాటు యాడ్స్‌ కూడా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై .. మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నపళంగా ప్రముఖ మీడియా చానళ్ల ఎడిటర్లంతా .. ప్రెస్ క్లబ్‌లో సమావేశం పెట్టారు. మీడియాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మీడియాపై పెత్తనం చేద్దామనకుంటే సాధ్యం కాదన్నారు. చేతనైతే శ్రీరెడ్డి లేవనెత్తిన సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ.. ఆ సమస్యలకు మద్దతు పలికిన మీడియాపైనే ఎటాక్ చేస్తామంటే… చేతులు కట్టుకుని కూర్చోబోమని.. చానళ్ల ఎడిటర్లంతా నేరుగా టాలీవుడ్‌కు హెచ్చరికలు పంపారు.

మీడియాపై నిషేధం అనే ఆలోచనే… చాలా డేంజర్‌ అనేది.. టాలీవుడ్‌లో అంతర్గతంగా వినిపిస్తున్న మాట. మీడియా నెగెటివ్ టాక్‌ ప్రచారం చేయడం వల్ల… భవిష్యత్‌ తారుమారైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అగ్రహీరోల సినిమాలకు ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగుంటే మౌత్ టాక్ వస్తుంది. దాంతో ఆటోమేటిక్‌గా మూవీకి ప్రచారం లభిస్తుంది. కానీ చిన్న, మధ్య స్థాయి హీరోలకు… ఓపెనింగ్స్ అంతంతమాత్రమే. వారి సినిమాలు నిలబడాలంటే… మీడియాలో వచ్చే ప్రచారమే ముఖ్యం. అందులో టీవీ చానల్సే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకునే రేంజ్‌లో పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టే స్థితిలో టాలీవుడ్ లేదు. సోషల్ మీడియా మీద అత్యధికంగా ఆధారపడుతున్నప్పటికీ.. ఇప్పటికీ మెయిన్‌స్ట్రీమ్ మీడియా టీవీ చానళ్లే. నలుగుర్ని నిషేధిస్తే మిగతా చానాళ్లు టాలీవుడ్‌ను ఎంటర్‌టెయిన్ చేయడం కష్టమే.

ఇదే కాదు.. టాలీవుడ్ పెద్దలకు మీడియా నుంచి వస్తున్న హెచ్చరికల్లో చాలా అంతరార్థాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ.. మీడియా టాలీవుడ్‌తో చాలా చాలా సన్నిహిత సంబంధాలు మెయిన్‌టెయిన్ చేసింది. డ్రగ్స్ లాంటి కేసుల్లో టాలీవుడ్ బిగ్ విగ్స్ పేర్లు బయటకు వచ్చినా… చాలా సందర్భాల్లో తొక్కి పెట్టిందనే ప్రచారం ఉంది. ఆధారాలతో సహా పోలీసులు పట్టుకుంటే ఎవరూ ఏం చేయలేరు కానీ… పోలీసులు ఇచ్చే లీకులను ప్రచారంలోకి పెడితే.. ఇప్పటికి… టాలీవుడ్‌లో పెద్ద ఫ్యామిలీల పరువు ఎప్పుడో బజారున పడి ఉండేదని.. మీడియా వర్గాలు అంతర్గతంగానే చెబుతున్నాయి. ఇక నుంచి ఇలాంటి పరిమితులు మీడియా పెట్టుకునే అవకాశం లేదు. కావాలంటే… ఇలాంటి సందర్భాలు సృష్టించుకుని మరీ… టాలీవుడ్ పెద్దలపై.. ముఖ్యంగా.. తమ చానళ్లపై నిషేధం విధించిన వారిపై … రివర్స్ ఎటాక్ చేయడం మాత్రం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి.

నిషేధం అనే కాన్సెప్ట్‌ కారణంగా టాలీవుడ్‌తో నేరుగా యుద్ధం చేయడానికి మీడియా సిద్ధమయింది. ఇప్పటి వరకు తెలుగు మీడియా పోకడలు గమనించిన వారికి… తమను టార్గెట్ చేసిన వారిని.. గబ్బు పట్టించే వరకూ మీడియా నిద్రపోని విషయం అర్థమవుతుంది. ఇప్పుడు టాలీవుడ్‌పైనా అదే వ్యూహం మీడియా అనుసరిస్తే.. ఇక టీవీ చానల్స్‌లో బ్రేకింగ్‌ న్యూసులన్నీ…సినిమా ఇండస్ట్రీలోని నలుపు గురించే ఉండే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close