గాంధీతో నాని?

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ. ఎక్స్ ప్రెస్ రాజాతో మ‌రో హిట్టు కొట్టాడు. ఆ త‌ర‌వాత గాంధీ సినిమా ఏంటి?? అనే విష‌యంలో ఇంకా ఓ స్ఫ‌ష్ట‌త రాలేదు. ఇప్పుడు త‌న మూడో సినిమాకి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టు టాక్‌. నేచుర‌ల్ స్టార్ నానితో గాంధీ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇటీవ‌లే నానిని క‌ల‌సి గాంధీ ఓ క‌థ చెప్పాడ‌ని, సింగిల్ సిట్టింగ్ లోనే నాని ఈ కథ‌ని ఓకే చేశాడ‌ని తెలుస్తోంది. ఇది కూడా ఓ కొత్త యాంగిల్ లో సాగే ల‌వ్ స్టోరీ అని తెలుస్తోంది. నిన్ను కోరి త‌ర‌వాత‌.. ఎంసీఏ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు నాని. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే నాని – మేర్ల‌పాక గాంధీ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. నిర్మాత‌, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com