చైతన్య : తప్పు ..వంద శాతం ఉద్యోగులదే!

ఉద్యోగులు ప్రభుత్వానికి ఎలా సహకరించారు ?. మాటల్లో చెప్పుకోలేనంతగా సహకరించారు. జగన్‌ సీఎం అవగానే ఉద్యోగ సంఘ నేతలు పులకరించపోయారు. మేం తెచ్చుకున్న ప్రభుత్వం అని పూనకాలొచ్చేలా ప్రసంగించారు. ఆ తర్వాత కరోనా పేరుతో రెండు నెలల పాటు సగం జీతాలిచ్చినా నోరు తెరవలేదు. డీఏలన్నీ పెండింగ్ పెట్టినా మాకు “సామాజిక బాధ్యత” ఉందని ప్రభుత్వంపై సానుభూతి చూపారు. ఆ తర్వాత రకరకాల ప్రయోజనాలు కట్ చేసినా నోరు మెదపలేదు. చివరికి విశాఖకు రాజధాని మారుస్తామని చెప్పినా సమర్థించారు. ఇంతగా సపోర్ట్ చేసిన ఉద్యోగులకు సీఎం జగన్ ఏమిచ్చారు ? అంధకారమైన భవిష్యత్ ఇచ్చారు. అత్యంత దారుణమైన అగౌరవం ఇచ్చారు. ఉద్యోగులను తమను తము అసహ్యించుకునేలా ట్రీట్ మెంట్ ఇచ్చారు.

అన్నీ తగ్గించి జీతం ఎలా పెరుగుతుంది మాస్టారూ !?

27 శాతం ఉన్న ఐఆర్‌ను ఫిట్‌మెంట్ వచ్చే సరికి 23 శాతం తగ్గించారు. హెచ్‌ఆర్ఏ తగ్గించారు. సీసీఏ లేపేశారు. అలవెన్స్‌లన్నీ కోతేశారు. ఇన్నీ కోతేసిన తర్వాత కూడా జీతం పెరుగుతుందని ఏ లెక్కలో చెబుతున్నారు. నమ్మాలని ఎందుకు వెంట పడుతున్నారు. పే స్లిప్‌ల పేరుతో ఎందుకు డ్రామాలాడుతున్నారు. ఇవన్నీ ఉద్యోగులకు తెలుసు. డీఏల పేరుతో దొంగ లెక్కలు రాసిన ప్రభుత్వం తీరుతో ఉద్యోగులకు మూర్చ వచ్చినంత పనైంది. ఇంత కాలం అడ్డగోలుగా సమర్థిస్తే అంతో ఇంతో ప్రయోజనం కల్పిస్తారనుంటే ఉన్నదానికే ఎసరు పెట్టడంతో ఉద్యోగులు.. ఏదో సామెతను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి.

అంత భారం పడితే పాత జీతాలే ఇవ్వొచ్చుగా !

ప్రభుత్వం తమపై రూ. పదివేల కోట్ల భారం కొత్త పీఆర్సీ వల్ల పడుతుందని తెగ ఇదైపోతోంది. అలాంటప్పుడు తమకు పాత జీతాలే ఇవ్వండి మహా ప్రభో అని అంటున్న ఉద్యోగుల కోరికను మన్నించి రూ. పది వేల కోట్లను మిగుల్చుకోవచ్చుగా. ప్రభుత్వం ఎందుకు అంత ఎక్కువ ఖర్చు పెట్టుకుటోంది. అంటే ఈ పదివేల కోట్ల వెనుక ఉన్నది లెక్కల మాయాజాలమేనన్నమాట. ఈ పీఆర్సీ ని అమలు చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మిగులు ఉంటుంది. జీతభత్యాలఖర్చు తగ్గుతుంది. అందుకే కొత్త జీతాలు ఇవ్వడానికి ప్రైవేటు ఏజెన్సీని కూడా రంగంలోకి దింపి.. అకౌంట్లలో జీతాలు జమ చేశారు.

ఉద్యోగులు ఇచ్చిన అలుసుతోనే ఇది సాధ్యమైంది !

ఉద్యోగులు.. ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వం ఏం చెప్పినా ఆత్మాభిమానం అనేది లేకుండా తమకు ఇచ్చే ప్రయోజనాలు తమకు ఇస్తే చాలన్నట్లుగా చెలరేగిపోవడంతోనే సమస్య వచ్చింది. వారు ఇచ్చిన అలుసుతోనే.. వారిపై ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవచ్చని ప్రభుత్వం డిసైడైంది. ఉద్యోగులకు ఇప్పుడు కూడా సీన్ అర్థమైందని అనుకోవడం లేదు. వారో భిన్నమైన మార్గంలో ఉన్నారు. లేకపోతే ఇన్ని సార్లు ప్రభుత్వాన్ని నమ్మి మోసపోతారా ? ఇప్పుడు కూడా వారి ట్రాప్‌లో ఎందుకు పడతారు ? ఓ వైపు చర్చల పేరుతో షో చేస్తూ మరో వైపు చేయాలనుకున్నది చేయడం దేనికి సంకేతం !

ఫలితం అనుభవించాల్సిందే !

ఉద్యోగులకు వేరే మార్గం లేదని సజ్జల హెచ్చరిస్తున్నారు. చర్చలకు వచ్చి ప్రభుత్వం చెప్పింది విని.. ఓకే చేసిసైలంట్‌గా ఉండటం మాత్రం ఉద్యోగులకు ఎలాంటి చాయిస్ లేదని చెబుతున్నారు. ఉద్యోగులు కాస్త తెలివిగా ఆలోచిస్తే ఇది నిజమే అనుకోకతప్పదు. అలా అంగీకరిస్తే వచ్చే పదేళ్ల పాటు వారి ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. జీతం పెరగదు. రూపాయి విలువ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి దుస్థితికి కోరి తెచ్చుకుంది ఉద్యోగులే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close