బాబు వ్యాఖ్య‌ల‌పై మోడీ స్పంద‌న అలా ఉంటుందా..?

త్వ‌ర‌లోనే రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఆ త‌రువాత‌, ఏపీ రాజ‌కీయాల్లో పొలిటిక‌ల్ హీట్ మ‌రింత‌గా పెరిగేట్టుగానే క‌నిపిస్తోంది. ఎలా అంటారా… టీడీపీ పెంచుతున్న‌ మాట‌ల యుద్ధానికి భాజ‌పా స్పంద‌న ఉండే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉంది. విప‌క్ష నేత జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో టీడీపీ నేతలు ఏ స్థాయిలో విమ‌ర్శించారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కేసుల‌ను మాఫీ చేయించుకోడం కోస‌మే మోడీ కాళ్లు ప‌ట్టుకునేందుకు జ‌గ‌న్ వెళ్లారని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యాల్ని పీఎంవో కాస్త సీరియ‌స్ గానే తీసుకుంద‌ట‌! ఎందుకంటే, మోడీ కాళ్లు ప‌ట్టుకుంటే కేసులు మాఫ్ అయిపోతాయంటే… సీబీఐ, ఈడీ లాంటివి మోడీ ఆడ‌మ‌న్న‌ట్టు ఆడుతున్నాయ‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించిన‌ట్టే క‌దా!

నిజానికి, ఏ కాంగ్రెస్ నాయ‌కుడో ఈ విమ‌ర్శ చేసి ఉంటే మోడీ సీరియ‌స్ గా తీసుకునేవారు కాద‌నీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, పైగా ఎన్డీయే భాగ‌స్వామి అయిన టీడీపీ అధ్య‌క్షుడు చేయ‌డాన్ని మోడీ తీవ్రంగా ప‌రిగ‌ణించార‌ని భాజ‌పాకి చెందిన ఓ నాయ‌కుడు ఆఫ్ రికార్డు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గోద్రా అల్ల‌ర్ల స‌మ‌యంలో అప్ప‌ట్లో భాజ‌పాని ఉద్దేశించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల్నీ, మోడీపై చేసిన విమ‌ర్శ‌ల్ని ఎవ్వ‌రూ మ‌ర‌చిపోలేద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని వారే అంటున్నారు! ఇటీవ‌ల చంద్ర‌బాబు చేసిన కామెంట్స్ పై భాజ‌పా అంత హ‌ర్ట్ అయితే స్పంద‌న ఏదీ… అనేగా అనుమానం. క‌చ్చితంగా స్పంద‌న ఉంటుంద‌నే ఢిల్లీ వ‌ర్గాలు అంటున్నాయి. రాష్ట్రప‌తి ఎన్నిక పూర్త‌య్యాక తెలుగుదేశం విష‌య‌మై ప్ర‌త్యేక దృష్టి పెట్టేందుకు భాజ‌పా సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం. అందుకే, కాస్త ప్ర‌స్తుతం కాస్త మౌనంగా ఉంటోంది అంటున్నారు!

ఆంధ్రాలో చోటు చేసుకున్న తాజా ప‌రిణామాల‌న్నింటిపైనా అమిత్ షా క‌న్నేసిన‌ట్టు స‌మాచారం. ఆంధ్రాలో సాగునీటి ప్రాజెక్టులు, టీడీపీ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల తీరు, వివిధ అంశాల‌పై టీడీపీ నేత‌లు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోప‌ణ‌లు.. ఇలా అన్నిర‌కాల స‌మాచారాన్నీ అమిత్ షా రాబ‌డుతున్న‌ట్టు చెప్పుకుంటున్నారు. వీట‌న్నింటిపై కేంద్రం నుంచి స్పంద‌న ఉంటుంద‌నీ, చ‌ర్య‌లు ఉండే అవ‌కాశాలు స్ప‌ష్ట‌మ‌ని అంటున్నారు. ఆ ధీమాతోనే ఏపీ భాజ‌పా నేత‌లు కూడా ఈ మ‌ధ్య కాస్త దూకుడు పెంచార‌నీ చెబుతున్నారు. తెలంగాణ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా టీడీపీతో పొత్తుపై అమిత్ షా ఇప్ప‌టికే ఒక క్లారిటీ ఇచ్చేసిన‌ట్టే. ఆంధ్రాలో కొన‌సాగుతుంద‌ని ప్ర‌స్తుతానికి చెబుతున్నా.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల త‌రువాత చోటు చేసుకునే ప‌రిణామాలు వేరుగా ఉండేట్టుగానే క‌నిపిస్తున్నాయి. చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ‌ల‌కు మోడీ బాగానే హ‌ర్ట్ అయ్యార‌ని ఈ మ‌ధ్య క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ, ఆయ‌న స్పంద‌న మాట‌ల్లో కాదూ, చేత‌ల్లో ఈ రేంజిలో ఉండ‌బోతోంద‌ని టీడీపీ ఇప్ప‌టికైనా అర్థం చేసుకుంటోందో లేదో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close