యూరప్‌లో ముస్లిం ఇమ్మిగ్రెంట్లపై నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం యూకేలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. లోలా అనే పదమూడేళ్ల చిన్నారిపై ఓ ముస్లిం ఇమ్మిగ్రెంట్ అత్యాచారం చేయబోతే.. ఆమె అతడిని గాయపరిచింది. ఈ కేసులో ముస్లిం ఇమ్మిగ్రెంట్ కాకుండా లోలాపై కేసు పెట్టారు. ఈ ఘటన యూకే పౌరుల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. వారు రోడ్డెక్కి నిరసనలు తెలియచేస్తున్నారు. వారికి మస్క్ మద్దతు తెలుపుతున్నారు.
ముస్లిం ఇమ్మిగ్రెంట్ల నేరాలతో వణికిపోతున్న యూరప్ ప్రజలు
2024-2025 మధ్య కాలంలో జర్మనీ, యూకే, పోలాండ్, స్పెయిన్, ఐర్లాండ్ వంటి దేశాల్లో యాంటీ-ఇమ్మిగ్రేషన్ ప్రదర్శనలు, హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఇవి కేవలం స్థానికుల అసంతృప్తి మాత్రమే కాకుండా, రాజకీయ పార్టీలు, మీడియా, సామాజిక మాధ్యమాల ప్రభావంతో మరింత తీవ్రమవుతున్నాయి. 2024లో యూకేలో జరిగిన దాడులు, రయట్స్ ఫార్-రైట్ ఆందోళనలతో మొదలైన ఈ ట్రెండ్ 2025లో మరింత విస్తరించింది. జర్మనీలో 2024లో 3,000కు పైగా ఇస్లామోఫోబియా ఘటనలు నమోదయ్యాయి.
పోలాండ్ లెక్కలపై మస్క్ ట్వీట్
పోలాండ్‌లో జులై 2025లో ఫార్-రైట్ సంస్థలు నిర్వహించిన జాతీయ ఆందోళనలు ఇమ్మిగ్రేషన్ వ్యతిరేకతను హైలైట్ చేశాయి. ఈ ఆందోళనల సమయంలో ఓ పాకిస్తాన్ ఇమ్మిగ్రెంట్.. తాము పెళ్లి చేసుకుని ఒక్కో జంట ఐదుగురు పిల్లల్ని కంటామని.. పోలాండ్ వాళ్లు ఒక్కర్నే కంటారని. త్వరలోనే పోలాండ్ తమ చేతుల్లోకి వస్తుందని చేసిన హెచ్చరికల వీడియో వైరల్ అయింది. అతని లెక్కలు కరెక్టేనని మస్క్ కూడా ట్వీట్ చేశారు. స్పెయిన్‌లో గత నెల రోజులుగా యాంటీ-మిగ్రెంట్ ప్రదర్శకులు పోలీసులతో ఘర్షణపడ్డారు. ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్, బ్రిటన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆస్ట్రియాలలో మాస్ డెపోర్టేషన్లు డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు జరిగాయి. డెన్మార్క్‌లో స్థానికులు మసీదు పైన ‘రెమిగ్రేషన్’ బోర్డు పెట్టి నిరసన తెలిపారు. యూకేలో రెఫ్యూజీ హోటళ్ల వద్ద, ఇటలీలో వెనిస్ ర్యాలీలు, జర్మనీలో బెర్లిన్ టెన్షన్లు, ఐర్లాండ్‌లో 10,000 మంది మార్చ్‌లు జరిగాయి.
క్రైమ్ రేట్ కారణంగా పెరుగుతున్న ఇస్లామోఫోబియా
ఇమ్మిగ్రెంట్లతో సంబంధిత క్రైమ్ రేట్లు, ఇంటిగ్రేషన్ వైఫల్యాలు, సాంస్కృతిక తేడాల వల్ల ఇస్లామోఫోబియా పెరుగుతోంది. ముస్లిం యువతలో రాడికలైజేషన్ పెరిగింది, స్కూల్స్‌లో ఇస్లాం కన్వర్షన్ బుల్లింగ్, ప్రేయర్ డిస్రప్షన్లు, షరియా డిమాండ్లు ఉన్నాయి. జర్మనీలో ‘ముస్లిం ఇంటరాక్టివ్’ గ్రూప్ కాలిఫేట్, షరియా డిమాండ్ చేస్తోంది. ఇమ్మిగ్రేషన్, హై ముస్లిం ఫెర్టిలిటీ రేట్లతో 2025 నాటికి యూరప్ ముస్లిం పాపులేషన్ డబుల్ అవుతుందని అంచనాలతో అక్కడి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా నిజమేనని మస్క్ .. వారిని మరింతగా రెచ్చగొడుతున్నారు.