సోషల్ మీడియాలో నిర్మాత నాగవంశీపై వాడివేడి కథనాలు ప్రచారం అవుతూ వున్నాయి. బాలీవుడ్ సినిమా వార్ 2 ని తెలుగులో రిలీజ్ చేశారు వంశీ. సినిమా మీద కాన్ఫిడెన్స్‌తో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్‌ని, ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. అయితే సినిమా నిరాశ పరచడంతో ఇప్పుడు అందరూ వంశీని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. వంశీ మిస్సింగ్ అంటూ పోస్టులు పెట్టారు. ఒక ఏడాది వరకూ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు రూమర్స్ క్రియేట్ చేశారు. నాగ వంశీ దుబాయ్ వెళ్లిపోయాడని, ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకొన్నారని, ఆయన పై బోల్డన్ని మీమ్స్ సృష్టించారు.
కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న వంశీ ఇప్పుడు మళ్లీ తనదైన స్టైల్లోనే ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. “ఎంటి నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ ఇది, వంశీ అదీ అని ఫుల్ హడావుడి నడుస్తుంది. ఎక్స్‌లో మంచి రైటర్స్ ఉన్నారు. మీ అందరినీ డిసప్పాయింట్ చేసినందుకు సారీ. ఇంకా ఆ టైమ్ రాలేదు. దానికి ఇంకా మినిమం 10–15 ఏళ్లు పడుతుంది. మాస్ జాతరతో కలుద్దాం” అని చెప్పుకొచ్చారు. మొత్తానికి తనపై వస్తున్న వరుస రూమర్స్‌కి చెక్ పెట్టారు వంశీ.