మళ్లీ కాంగ్రెస్ తీర్థం..! కిరణ్‌ వ్యూహమేంటి..?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీని త్వరలో కలసి చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత పార్టీలో చేరిపోవచ్చు. ఇప్పటికే చాందీతో.. కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ ఎంపీ పళ్లంరాజు… కీలకంగా వ్యవహరించారు. నల్లారి ఫ్యామిలీది మొదటి నుంచి కాంగ్రెస్ రక్తం. చిత్తూరు జిల్లాలో కిరణ్ తండ్రి అమర్నాథ్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. మంత్రిగా వ్యవహరించారు కూడా. ఆయన హఠాన్మరణం వల్లే కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఓ వైపు తెలంగాణ ఉద్యమం.. మరో వైపు కాంగ్రెస్ మార్క్ రాజకీయాలతో ఆయన తట్టుకోలేకపోయారు. అప్పుడు అవకాశం కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చింది. కానీ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయంతో హైకమాండ్‌తో విబేధించారు. చివరికి జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టుకున్నారు. ఒక్క చోట కూడా డిపాజిట్లు రాకపోవడంతో… సైలెంట్‌గా ఉన్నారు. కిరణ్ సోదరుడు.. కిశోర్ కుమార్ రెడ్డి..కొద్ది రోజుల కిందటే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు టీడీపీ మంచి ప్రాధాన్యం ఇస్తోంది. కేబినెట్ ర్యాంక్ ఉండేలా.. ఓ కార్పొరేషన్ పదవిని కూడా ఇచ్చింది.

అన్న కిరణ్ మాటకు ఎదురు చెప్పి.. టీడీపీలో కిషోర్ చేరే పరిస్థితి లేదు. కిషోర్ చేరికకు.. కిరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఉంటారని చెబుతంటారు. అలాంటిది ఇప్పుడు కిరణ్.. కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఎందుకు చేరాలనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ముఖాముఖి లేదా.. త్రిముఖ పోటీ ఉన్న చోటే పోటీ చేయాలనుకుంటోంది. కేవలం 250 పార్లమెంట్ సీట్లలోనే పోటీ చేయాలనుకుంటోంది. దానికే కట్టుబడి ఉంటే.. ఏపీలో పోటీ చేసే అవకాశం లేదు. పోటీ చేసినా బావుకునేది ఏమీ ఉండదు.

అయితే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేకపోయినా.. జాతీయ రాజకీయాల్లో మాత్రం మాజీ ముఖ్యమంత్రిగా తనకు ఏఐసిసిలో గుర్తింపు వస్తుందన్న అంచనాలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో… కాంగ్రెస్ మద్దతు అయినా.. లేకపోతే.. ప్రాంతీయ పార్టీల మద్దతుతో అయినా ప్రభుత్వం ఏర్పడే సూచనలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏ విధంగా చూసినా… తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కాంగ్రె్స ప్రధాన ప్రత్యర్థి కాదు. తాను కాంగ్రెస్‌లో ఉండటం వల్ల… తమ్ముడికీ ఇబ్బంది రాదని కిరణ్ భావిస్తూ ఉండవచ్చు. ముందస్తు ఎన్నికలు ఖాయమని ప్రచారం జరుగుతండటంతో.. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని కిరణ్ డిసైడయినట్లు ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

ఘోర రైలు ప్రమాదం… కవచ్ టెక్నాలజీ ఏమైంది..?

దేశంలో ఒక దాని వెనక మరొకటి వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన జరుగుతుండటంతో రైలు ప్రయాణాలు అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా...

లోక్‌సభ స్పీకర్‌గా టీడీపీ అభ్యర్థి అయితే ఏకగ్రీవం !

లోక్‌సభ స్పీకర్ గా టీడీపీ అభ్యర్థిని నిలబెడితే తాము మద్దతు ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇప్పటికే ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నరని తమకు స్పీకర్ పదవి ఇవ్వాలని...

చైతన్య : ఓడిపోయినప్పుడే ఈవీఎంలు గుర్తు రావడం అసలు రోగం !

ఈవీఎంలపై భారత రాజకీయ పార్టీల్లో ఎవరికీ నమ్మకం లేదు. చివరికి బీజేపీ, కాంగ్రెస్ కు కూడా లేదు. కానీ వారి అభిప్రాయాలు ఫలితాలు వచ్చినప్పుడల్లా మారిపోతూండటంతోనే సమస్య వస్తోంది. గెలిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close