రాక్ స్టార్‌గా నాని

నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం ‘కృష్ణార్జునుల యుద్దం’. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. సంక్రాంతి సంద‌ర్భంగా కృష్ణ‌, అర్జున్‌ల లుక్స్‌ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. కృష్ణ‌పై ఓ పాట‌ని కూడా వ‌దిలింది. కృష్ణ లుక్ చూస్తే… ఊర మాస్ అని అర్థ‌మైపోతోంది. మ‌రి అర్జున్ మాటేంటి? అత‌ని అల్ట్రా మోడ్ర‌న్‌గా చూపిస్తోంది చిత్ర‌బృందం. ఇంత‌కీ మేట‌రేంటంటే.. అర్జున్ ఓ రాక్ స్టార్ అట‌. ‘వ‌న్లో’ మ‌హేష్‌బాబు, ‘ఇద్ద‌ర‌మ్మాయిలు’లో అల్లు అర్జున్‌ల‌ను రాక్‌స్టార్లుగా చూపించారు. ఇప్పుడు వాళ్ల ప‌క్క‌న నాని కూడా చేర‌బోతున్నాడ‌న్నమాట‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. హ‌రిష్ పెద్ది నిర్మాత‌. దాదాపుగా ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ క్లోజ్ అయ్యింది. శాటిలైట్ కూడా అమ్ముడుపోయింది. అన్ని ర‌కాలుగానూ దాదాపుగా రూ.8 నుంచి 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ని నిర్మాత ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తోంది. నాని సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు. మేర్ల‌పాక గాంధీకీ చేతిలో హిట్స్ ఉన్నాయి. సో… ఈ మాత్రం టేబుల్ ప్రాఫిట్ ద‌క్క‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు. డ‌బుల్ హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్న నాని.. ఈసినిమాని ఏ రేంజ్‌లో స‌క్సెస్ చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close