ఆటంకాలను అధిగమించి మళ్లీ యువగళం నినాదం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం మరోసారి నినదించబోతోంది. చంద్రబాబును అరెస్టు చేసిన రోజున ఎక్కడ ఆపారో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. కుప్పం నుంచి ప్రారంభమైన యువగళంపై తప్పుడు ప్రచారం చేసేందుకు.. పోలీసులతో ఆటంకాలు సృష్టించేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ ఇంతింతై అన్నట్లుగా జన ప్రభంజనంగా యువగళం మారింది. మైకులు లాక్కుంటే.. గొంతు నొప్పి పుట్టేలా మాట్లాడారు. స్టేజ్ వేయనీయకపోతే చిన్న స్టూల్ వాడారు. పోలీసులు దాన్ని కూడా వదిలి పెట్టలేదు. అదీ లాక్కున్నారు. అయినా లోకేష్ ఎక్కడా తగ్గలేదు. ఆయన పట్టుదల నిరంతరం పెరుగుతూనే వచ్చింది.

ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర, మరో వైపు చంద్రబాబు భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో ఎటు చూసినా టీడీపీనే కనిపిస్తోందని…తాము ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి చంద్రబాబు అరెస్టుకు కుట్ర చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా లేకుండానే అరెస్టు చేసి ఆ తర్వాత తాము చేయాలనుకున్నవన్నీ చేశారు. చంద్రబాబుపై చిన్న ఆధారం లేదని హైకోర్టు తేల్చేసింది. 53 రోజుల పాటు నిర్బంధించారు. వరుసగా కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ న్యాయపోరాటం కోసం ఎక్కువ సమయం వెచ్చించారు.

చంద్రబాబు పై పెట్టేవి తప్పుడు కేసులేనని జాతీయ స్థాయిలో మీడియా దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుల్లోనూ దాదాపుగా నిరూపించారు. నిధుల దుర్వినియోగం జరిగిందని కానీ.. చంద్రబాబు లంచాలు తీసుకున్నారని కానీ నిరూపించలేకపోయారు. మిషన్ కంప్లీట్ అవడంతో నారా లోకేష్ పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తున్నారు.

అడ్డంకులను అధిగమించిన తరవాత చేస్తున్న పాదయాత్ర మరింతగా రీ సౌండ్ రానుంది. ప్రజల నుంచి స్పందన రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాఫీగా సాగిపోయే యాత్రకు ఆటంకాలు కల్పిస్తే… నెలకు కొట్టిన బంతిలా యువగళం ఎగసిపడనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close