మహేష్ తో కలిసి నటిస్తున్నందుకు హ్యాపీ గా వుంది

హాస్య‌ల చిత్రాల క‌థానాయ‌కుడుగా…ఎన్నో విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు న‌రేష్. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న న‌రేష్ జ‌న్మ‌దిన వేడుక క్రిష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల దంప‌తులు, అభిమానులు స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్ర‌సాద్, శివాజీరాజా, శివ‌క్రిష్ణ త‌దిత‌ర‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ కృష్ణ‌ మాట్లాడుతూ…న‌రేష్ కెరీర్ లో ఎక్కువుగా కామెడీ హీరోగా చేసిన‌ప్ప‌టికీ…సాహ‌స‌మే నా ఊపిరి లాంటి యాక్ష‌న్ మూవీస్ కూడా చేసాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా స్టార్ డ‌మ్ తెచ్చుకున్నాడు. మ‌రిన్ని మంచి పాత్ర‌లు పోషించి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. మా అధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ…చిన్న‌ప్ప‌టి నుంచి న‌రేష్ నేను ట్విన్స్ లా పెరిగాం. మంచి మ‌న‌సున్న న‌రేష్ మ‌రో 50 ఏళ్లు ఇలాగే పుట్టిన‌రోజులు జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

న‌రేష్ మాట్లాడుతూ…క్రిష్ణ గారు అమ్మ విజ‌య‌నిర్మ‌ల ఇద్ద‌రు నాకు రెండు పిల్ల‌ర్స్ లా నా కెరీర్ కి ఎంత‌గానో స‌హ‌క‌రించారు. 2015 లో నేను న‌టించిన ద్రుశ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలు ఘ‌న విజ‌యం సాధించ‌డం చాలా సంతోషం క‌లిగించింది. 2016 జ‌న‌వ‌రి 1 రిలీజైన నేను..శైల‌జ సినిమాలో మంచి పాత్ర పోషించాను. ఈ సినిమాతో ఈ సంవ‌త్స‌రంలో నాకు స‌క్సెస్ స్టార్ట్ అయ్యింది. మ‌హేష్ న‌టిస్తున్నబ్ర‌హ్మోత్స‌వం సినిమాలో ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నాను. ఎప్ప‌టి నుంచో మ‌హేష్ తో క‌ల‌సి న‌టించాల‌నుకున్నాను. అది బ్ర‌హ్మోత్స‌వం సినిమాతో నెర‌వేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫ‌స్ట్ టైం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో అ ఆ సినిమాలో న‌టిస్తున్నాను. ఈ సినిమాలో న‌దియాతో క‌లిసి న‌టిస్తున్నాను. సినిమాను మ‌లుపు తిప్పేకీ రోల్ పోషిస్తున్నాను. అలాగే సాయికుమార్ త‌న‌యుడు ఆది తో క‌ల‌సి న‌టించిన గ‌రం త్వ‌ర‌లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో డిఫ‌రెంట్ రోల్ చేసాను. అలాగే నూత‌న ద‌ర్శ‌కురాలు చునియా ద‌ర్శ‌క‌త్వంలో ప‌డేసావే సినిమాలో న‌టిస్తున్నాను. 2016 నాకు మ‌రింత పేరు తెస్తుంద‌ని గ‌ట్ట న‌మ్మ‌కం. కృష్ణ గారు న‌టిస్తున్న శ్రీశ్రీ లో పోలీసాఫీస‌ర్ గా కీల‌క పాత్ర పోషిస్తున్నాను. అలాగే మా అబ్బాయి న‌వీన్ న‌టిస్తున్న ఐనా ఇష్టం నువ్వు ఈ సంవ‌త్స‌రంలో రిలీజ్ అవుతుంది. అన్నిర‌కాలుగా 2016 నాకు ఆల్ రౌండ‌ర్ గా మంచి పేరు తీసుకువ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close