నరుడా డో నరుడా ట్రైలర్ : ఓన్లీ ఎంటర్టైన్మెంట్

బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం ‘విక్కీ డోన‌ర్‌’. తెలుగులో ఈ చిత్రాన్ని న‌రుడా – డోన‌రుడా పేరుతో రీమేక్ చేశారు. సుమంత్ క‌థానాయ‌కుడు. ప‌ల్లవి సుభాష్ క‌థానాయిక గా న‌టించిన ఈ చిత్రానికి మ‌ల్లిక్ రామ్ ద‌ర్శకుడు. ట్రైల‌ర్ మ‌హేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. బాలీవుడ్ సినిమా చూసిన వాళ్లకు ట్రైల‌ర్‌… ట్రూ కాపీ అనిపించొచ్చు. కానీ.. విక్కీ డోన‌ర్ ప‌రిచ‌యం లేనివాళ్లకు న‌రుడా – డోన‌రుడా ట్రైల‌ర్ హిలేరియ‌స్‌గా అనిపిస్తుంది. బాలీవుడ్ సినిమాలో హీరో పేరు విక్కీ. రీమేక్‌లోనూ హీరోకి అదే పేరు పెట్టేశారంటే… మ‌నోళ్లు ఎంత కొత్తగా ఆలోచించారో అర్థమ‌వుతుంది. అయితే.. ఈ సినిమా కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని మాత్రమే న‌మ్ముకొంద‌న్న విష‌యం ట్రైల‌ర్ చూస్తే అర్థమ‌వుతుంది.

సుమంత్ నోటి నుంచి వ‌చ్చిన డైలాగులు త‌క్కువే. సింహ‌భాగం త‌నికెళ్ల భ‌ర‌ణివే వినిపిస్తాయి. ప‌ల్లవి సుభాష్ స్ర్కీన్ ప్రెజెన్స్ అంతంత మాత్రంగా అనిపిస్తోంది. ఇక సిల్వర్ స్ర్కీన్‌పై ఎలా ఉండ‌బోతోందో?? హీరో క్యారెక్టరైజేష‌న్‌ని బ‌య‌ట పెట్టిన ఈ ట్రైల‌ర్‌.. ‘సినిమా ఓసారి చూడొచ్చు’ అనే భ‌రోసా క‌లిగిస్తోంది. అది చాలు.. సుమంత్‌కి ఓ స‌క్సెస్ ద‌క్కడానికి. పాపం… చాలా కాలం నుంచి హిట్టు కోసం విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నాడు సుమంత్‌. ఈ రీమేక్ అయినా.. సుమంత్ క‌ల ఫ‌లించేలా చేస్తుందేమో చూడాలి. అక్టోబ‌రు నెలాఖ‌రున ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close