నిఖిల్‌ నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం..!!

న్యూ జనరేషన్‌కు నచ్చే సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ ‘స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్‌ సూర్య’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ సొంతం చేసుకొని.. యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకొన్న నిఖిల్‌ సిద్దార్థ్.. “శంకరాభరణం” అనంతరం నటించే చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం మేఘన ఆర్ట్స్‌ పతాకంపై పి.వెంకటేశ్వర్రావు తన మొదటి చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి.. ‘టైగర్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తన ప్రతిభను ఘనంగా చాటుకున్న యువ ప్రతిభాశాలి “వి.ఐ.ఆనంద్‌” దర్శకత్వం వహిస్తున్నారు.

విజయదశమి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంబమైన ఈ చిత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ చిత్రం టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నారు.

చిత్ర నిర్మాత-మేఘన ఆర్ట్స్‌ అధినేత పి.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. “టైగర్” చిత్రంతో విజయం సాధించి, స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనాన్ని ఆవిష్కరించిన వి.ఐ.ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తనదైన శైలిలో సరికొత్త కధలని ఎంచుకునే హీరో నిఖిల్‌ ఈ కధని సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకె చేసారు. సాయిశ్రీరాం, అబ్బూరి రవి, శేఖర్‌చంద్ర, చోటా కే ప్రసాద్ వంటి సక్సెస్ ఫుల్ టేక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటుల ఎంపిక పూర్తి చేసి.. నవంబర్‌ చివరిలో సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం ” అన్నారు.

ఈ చిత్రానికి ఛీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌: విజయ్‌ కామిశెట్టి, కో-డైరెక్టర్‌: వరప్రసాద్‌ వరికూటి, ఆర్ట్‌: ఎ.రామాంజనేయులు, ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: సాయిశ్రీరాం, సహ నిర్మాత: డి.శ్రీనివాస్‌, నిర్మాత: పి.వెంకటేశ్వర్రావు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close