మెట్రో రైలుకి జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకి అదేమి సంబంధమో?

మజ్లీస్ పార్టీతో చేతులు కలిపి జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో విజయం సాధించాలని భావించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, వరంగల్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించగానే జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు జి.హెచ్.ఎం.సి.పరిధిలో ఉన్న 150 డివిజన్లలో తమ పార్టీ కనీసం 80 డివిజన్లు ఖచ్చితంగా గెలుచుకొంటుందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. డివిజన్ల పునర్వ్యవస్థీకరణ పేరిట సుమారు ఏడాది పాటు సమయం తీసుకొన్న కేసీఆర్, ఆపని పూర్తి చేయలేదు కానీ, ఓటర్ల జాబితాల సవరణ పేరిట ఆంధ్రా ఓటర్ల పేర్లను జాబితాలలో నుండి తొలగించిన తరువాత సర్వే చేయించుకొని తమ పార్టీయే గెలుస్తుందని దృవీకరించుకొన్నట్లున్నారు. అందుకే మజ్లీస్ పార్టీతో చేతులు కలపకుండా ఒంటరిగా పోటీ చేయాలనుకొంటునట్లున్నారు.

జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో విజయం సాధించేందుకు మజ్లీస్ పార్టీతో చేతులు కలపాలని ఇంతకు ముందు కేసీఆర్ భావించినపుడు, ఒవైసీ సోదరులను ప్రసన్నం చేసుకొనేందుకు మెట్రో రైల్ మార్గంలో చాలా మార్పులు చేర్పులు చేసేందుకు కూడా సిద్దపడ్డారు. సుల్తాన్ బజార్ మీదుగా సాగే మెట్రో రైల్ మొదటి దశ మార్గంలోనూ, పాత బస్తీ గుండా సాగే మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ కారిడార్ మార్గంలో చాలా మార్పులు చేర్పులు చేయాలని ఓవైసీ సోదరులు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు. అందుకు అప్పుడు ఆయన అంగీకరించారు. దాని వలన రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా సుమారు రూ.2,000-2,500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. ఎల్ అండ్ టి సంస్థ కూడా ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఇప్పుడు జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో తెరాస ఒంటరిగా పోటీ చేయాలని కేసీఆర్ నిశ్చయించుకొన్నారు కనుక మెట్రో రైల్ మార్గంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ముందు అనుకొన్న మార్గంలోనే నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. మెట్రో రైల్ నిర్మాణం చేస్తున్న ఎల్ అండ్ టి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.బి. గాడ్గిల్ స్వయంగా ఈ విషయం నిన్ననే ప్రకటించారు. మెట్రో రైల్ కారిడార్-1 ముందు అనుకొన్న ప్రకారం పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఎం.జి.బస్ స్టాండ్ మీదుగా నిర్మిస్తామని ప్రకటించారు. కనుక మెట్రో రైల్ కారిడార్-2 మార్గంలో మార్పులు చేర్పుల ప్రతిపాదనలను కూడా పక్కనపెడతారేమో? సుల్తాన్ బజారు మీదుగా మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించే ప్రతిపాదనను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న అక్కడి వ్యాపారస్తులు, అందుకు నిరసనగా ఇవ్వాళ్ళ అసెంబ్లీ ముందు ధర్నా నిర్వహించబోతున్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close