ప‌లాస పాపాయి.. డాన్సుల్లో బ‌డాయి!

శ్రీ‌లీల గురించి ఎవ‌రు మాట్లాడుకొన్నా.. త‌న డాన్సుల గురించి త‌ప్ప‌కుండా టాపిక్ వ‌స్తుంది. ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోయిన్ల‌లో శ్రీ‌లీల బెస్ట్ డాన్స‌ర్‌. ఇందులో మ‌రో మాటే లేదు. ద‌ర్శ‌కులు కూడా శ్రీ‌లీల డాన్సింగ్ స్టైల్ ని క్యాప్చ‌ర్ చేయ‌డానికి ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస్తున్నారు. నితిన్ కొత్త సినిమా ఎక్ట్సా – ఆర్డ‌న‌రీ మేన్‌లో కూడా ఇదే జ‌రిగింది. నితిన్‌, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన సినిమా ఇది. వ‌చ్చే వారం విడుద‌ల అవుతోంది. ఈ సినిమా నుంచి ‘ప‌లాస పాపాయి’ అనే పాట‌ని విడుద‌ల చేశారు. ఇందులో నితిన్, శ్రీ‌లీల డాన్సుల‌తో, సిగ్నేచ‌ర్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. నితిన్ కూడా మంచి డాన్స‌రే. అందుకే శ్రీ‌లీల‌తో త‌న డాన్సింగ్ కెమిస్ట్రీ బాగా కుదిరింది.

సంగీత ద‌ర్శ‌కుడు హారీశ్ జైరాజ్ సాధార‌ణంగా మెలోడీ ట్యూన్లే ఇస్తుంటాడు. త‌న నుంచి ఇలాంటి మాసీ పాట రావ‌డం కొత్త‌గా అనిపించింది. ట్యూన్ సంగ‌తి ఎలా ఉన్నా, క‌ల‌ర్ ఫుల్ పిక్చ‌రైజేష‌న్‌, మంచి బీట్‌, స్టెప్పుల‌తో హుషారుగా సాగిపోయింది. `ఎక్ట్సా` క్లైమాక్స్‌కి ముందొచ్చే పాట ఇది. యాక్ష‌న్ మూడ్‌లోకి ప్రేక్ష‌కులు వెళ్ల‌డానికి ఈ పాట మంచి టేకాఫ్ గా ఉంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close