మింగ మెతుకు ఉండదు కానీ పాకిస్తాన్ లో టర్రరిజాన్ని మాత్రం ప్రోత్సహించడానికి ఏమైనా చేస్తుంది పాకిస్తాన్. ఓ వైపు పాకిస్తాన్ ప్రజలు కనీస అవసరాలకూ ఇబ్బంది పడుతున్నారు. తమ దేశంలో విభజన వచ్చేలా ఉంది. ఓ వైపు ఆప్ఘన్ నుంచి తాలిబన్లూ దాడి చేస్తున్నారు. ఇన్ని సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు కశ్మీర్ ను మర్చిపోమంటూ మారణకాండకు దిగుతున్నారు. ఆ దేశానికి మరోసారి గట్టిగా బుద్ది చెప్పాల్సిన పరిస్థితిని కల్పించుకున్నారు.
పాకిస్తాన్ ఆర్మీ కుట్రతోనే ఉగ్రదాడి
కశ్మీర్ ఉగ్రకుట్ర వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ ఉంది. వారం రోజుల కిందట మునీర్ అనే ఆర్మీ జనరల్.. కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతిస్తామని బహిరంగంగా ప్రకటించారు. అంటే ఆయుధాలు ఇతర సాయం చేసి ఉగ్రవాద నెట్ వర్క్ ను మళ్లీ విస్తరిస్తున్నారన్నమాట. ఈ హెచ్చరికలను భారత్ సీరియస్ గా తీసుకోనట్లుగా కనిపిస్తోంది. మాటల్లో ఖండించారు కానీ.. ఆ మాటల వెనుక ఇంకేదైనా యాక్షన్ ప్లాన్ ఉందా అన్న ఆలోచన చేయకపోవడంతో ఘోరం జరిగిపోయింది.
పర్యాటకులు పెరగడంతో కశ్మీర్ కు కొత్త కళ
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ కు పర్యాటకులు పెరిగారు. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మారుతున్నాయి. ఆదాయం పెరుగుతోంది. కొత్త కొత్త ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇది మరింతగా అభివృద్ధి చెందితే ఉగ్రవాదానికి చోటు ఉండదు. అందుకే పాకిస్తాన్ తొందరపడుతోంది. కశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద సానుభూతిపరులను.. తమ దేశానికి చెందిన వారిని పంపి.. టెర్రర్ ముఠాలను తయారు చేస్తోంది.
ఎవరూ ఊహించలేని దెబ్బ పాకిస్తాన్‌పై పడాల్సిందే !
పాకిస్తాన్ కు ఇప్పుడు గట్టి బుద్ది చెప్పాల్సి ఉంది. సర్జికల్స్ స్ట్రైక్స్ లాంటి వాటితో కాదు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు.. తమ రక్షణ కోసం.. తమపై ఎవరు దాడి చేస్తారో వారిని ముందుగానే అంతం చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ అంతు చూడాల్సిన సమయం వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యక్ష సహకారంతో జరిగిన ఘోరం ఉంది. దీనికి తగ్గట్లుగా రియాక్షన్ చూపించాల్సి ఉంది.