పవన్‌పై నిందలు – ఎన్టీవీకి ఫ్యాన్స్ ” స్లిప్పర్ షాట్ ప్యాకేజీ “

నెంబర్ వన్ చానల్ అని ప్రచారం చేసుకునే ఎన్టీవీకి బ్లూ మీడియా ప్యాకేజీ రోల్‌లో ఉంటుందనేది బహిరంగరహస్యం. అలాంటి ప్యాకేజీ చానల్… తమకు డబ్బులిస్తున్న వారికి మద్దతుగా ఇతర పార్టీలపై బురద చల్లడం.. ప్యాకేజీ స్టార్ అంటూ కథనాలు రాయడం కాస్త ఎబ్బెట్టులాగనే ఉంటుంది. కానీ విలువన్నీ వదిలేసి… విలువ మాత్రమే చూసుకునే ఎన్టీవీ ఓనర్ నరేంద్రనాథ్ చౌదరికి .. తమ గోచీ ఉందా లేదా అని చూసుకునే తీరిక ఉండదు. జల్సా సినిమాలో బ్రహ్మీని పవన్ అడిగినట్లే… ఏమీ తేడాగా అనిపించడం లేదా… అని అడిగినా…. ఆ ప్యాకేజీ లెక్కల్లో మునిగి…. అదేమీ లేదే అనుకుంటూ ఉంటారు. కానీ సెగ మాత్రం ఇవాళ కాకపోతే రేపైనా తగులుతుంది.

ప్యాకేజీ స్టార్ అంటే పవన్ చెప్పుతో కొడతానన్నాడు .. గుర్తు లేదా ?

పవన్ కల్యాణ్‌పై ప్యాకేజీ స్టార్ అంటూ ఎన్టీవీలో కథనం వేసేశారు. మామూలుగా ఇలంటి పేర్లు వింటే జనసైనికులే కాదు పవన్ కల్యాణ్ కూడా. . చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు. బహుశా… ప్రభుత్వం మారిన తర్వాత తాను అన్న మాటల్ని చేసి చూపించినా … ఎవరికీ సానుభూతిపరుల నుంచి సపోర్ట్ రాదు. అలా కొడితే….పదే పదే టీవీలో చూపించుకుని… పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అన్నందుకు కొట్టారని గగ్గోలు పెట్టాల్సి ఉంటుంది.

ఏ 1 చంద్రబాబు అనిప్రచారం ఎంత ప్యాకేజీ తీసుకుని ?

చంద్రబాబును ఏ 37 గా సీఐడీ ఎఫ్ఐఆర్‌లో చేర్చితే .. ఏ వన్ గా ఎంత ప్యాకేజీ తీసుకుని ప్రచారం చేశారో ఎన్టీవీ చౌదరి .. ప్రేక్షక సమాజానికి చెప్పాలి కదా.. తప్పుడు సమాచారం ఇచ్చి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పరా ?. కేసులో నిజా నిజాల్ని విశ్లేషించలేరా … ఓ మాజీ ముఖ్యమంత్రిపై విధానపరమైన అంశాల్లో కేసులు పెట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నిండం చేతకాక పోవచ్చు కానీ… తప్పుడు ప్రచారాలతో బురదచల్లడం మాత్రం… ఎవరూ సహించలేరు.

జగన్ రెడ్డి ప్యాకేజీపై అభిమానం ఉంటే పొగుడుకో.. వేరే వాళ్లపై నిందలు క్షమార్హం కాదు !

జగన్ రెడ్డిపై అభిమానం ఉంటే .. ఆయన ఇచ్చిన ప్యాకేజీ అంత గొప్పగా ఉంటే.. ఆయనను పొగుడుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. చంద్రబాబు ను రజనీకాంత్ పొడిగితే వైసీపీ నేతలు బూతులు తిట్టినట్లుగా ఎవరూ తిట్టరు. కానీ.. ఉద్దేశపూర్వకంగా ప్యాకేజీ స్టార్ అని పేర్లు పెట్టి.. .. పవన్ ఏదో తప్పు చేశారన్నట్లుగా తప్పుడు రాతలు ..ప్రచారాలు చేస్తే మాత్రం… ఎవరు సహిస్తారు. అంత ఎందుకు.. ఎన్టీవీ చౌదరి సహిస్తాడా ? . టీవీ 5 ఓనర్… ఎన్టీవీ ఓనర్ ఇద్దరూ పోటీ పడి.. జాతకాలు బయటపెట్టుకుంటామని ప్రోమోలు వేసుకుని ఆగిపోయారు కదా . మీ కథలు మీరు చెప్పుకోకపోతే బయటకు తెలియనివని అనుకుంటున్నారా ? వైసీపీలో నే ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే… ఎన్టీవీ ఓనర్ గురించి చెప్పిన నిజాలకు మరింత మసి పూసి ప్రచారం చేయలేరా ?

ప్రాయశ్చిత్తం లేకుండా ఉండదు !

ఇప్పటికైనా మించిపోయింది లేదు…చేసినదానికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా చేస్తామన్నపట్టుదలతోనే విపక్షాలు ఉన్నాయి. కానీ తప్పులు ఒప్పుకుంటే… సీన్ కాస్త మారొచ్చు. మీడియా విలువలు పాటిస్తే… గౌరవం పెంచుకోవచ్చు. ఇప్పటికైనా ఆలోచించుకుంటే బెటర్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close