మేడే నుంచి ఆమరణ పవన్ దీక్ష?

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం త్వరలో అమరావతి కేంద్రంగా ఆమరణ దీక్షకు పూనుకోవాలని భావిస్తున్నారా? ఇందుకు సంబంధించి ఇప్పటికే అనుచరగణంతో చర్చలూ, ప్రణాళికలు పూర్తయ్యాయా?. ఈ ప్రశ్నలకి అవుననే సమాధానం వస్తోంది విశ్వసనీయ వర్గాల నుంచి.

వివరాల్లోకి వెళితే..జనసేనాని గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్బావ సభలో- అవసరమైతే ప్రత్యేక హోదా కోసం, విభజన హామీలు నెరవేర్చేందుకు, ఆమరణ దీక్షకు కూడా వెనుకాడనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 4,5,6 తేదీల్లో విజయవాడలోనే మకాం వేసి, ఆమరణదీక్ష విషయమై ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయసేకరణ చేయబోతున్నారు. ఆందోళనకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కలిసి వచ్చే అన్ని స్వచ్చంద సంఘాల మద్దతు కూడగట్టుకుని వెళ్లాలని భావిస్తున్నారు. బహుశా ఏప్రిల్‌ నెలాఖరు లేదా మే ఒకటో తేదీ (మే డే) నుంచి ఆందోళనకు దిగాలని భావిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా జనసేనాని దీక్షకు దిగితే ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామ స్ధాయిలో కూడా అభిమానులు, కార్యకర్తలు దీక్షలకు దిగేలా ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం. అలాగే పవన్‌కల్యాణ్‌ ఆమరణదీక్షకు దిగితే ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆందోళనకు దిగుదిగేలా వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆమరణ దీక్ష విషయమై ఏప్రిల్‌ మొదటి వారం లో విజయవాడలో జరిగే వరుస భేటీల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇంకా సాధారణ ఎన్నికలు కేవలం ఒక ఏడాది మాత్ర మే ఉండటం తో రాజకీయం మరింత వేడెక్కనుందని అర్థమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.